వరుస చోరీలకు పాల్పడుతున్న గ్యాంగ్‌ను కాకినాడ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు ఇచ్చిన సమాచారంతో 12 మందిని అదుపులోకి తీసుకోవడం కలకలం రేపింది. అన్నవరంలో ఓ ఇంట్లో చోరీ కేసుకు సంబంధించి విశాఖ జిల్లా భీమిలి మండలం చేపల ఉప్పాడకి చెందిన సీహెచ్ ఎల్లాజీని అరెస్టు చేశారు.
కాకినాడ జిల్లావ్యాప్తంగా జరిగిన ఆరు చోరీ కేసుల్లో సుమారు 60లక్షల రూపాయల విలువైన సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 12 మంది నిందితులను అరెస్టు చేశారు. అన్నవరంలో ఓ ఇంట్లో చోరీ కేసుకు సంబంధించి విశాఖ జిల్లా భీమిలి మండలం చేపల ఉప్పాడకి చెందిన సీహెచ్ ఎల్లాజీని అరెస్టు చేశారు. నిందితుడి నుంచి 172 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ బిందుమాధవ్ తెలిపారు. నిందితుడిపై 20 బైక్ దొంగతనాలతోపాటు.. ఇతర కేసులు ఉన్నాయని చెప్పారు. ప్రత్తిపాడు గోల్డ్ షాప్ చోరీ కేసులోనూ 9 మంది నిందితులను అరెస్టు చేసి.. 11 కిలోల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. మరో ఇద్దరు పరారీలో ఉండడంతో వేట కొనసాగిస్తున్నారు.
జగ్గంపేట, తుని, విజయవాడ పరిధిలో జరిగిన 4 వేర్వేరు బ్యాగ్ చోరీల కేసుల్లో 176 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుల్లో ఇద్దరు అంతర్ జిల్లా మహిళా దొంగల గ్యాంగ్‌ను అదుపులోకి తీసుకున్నారు. తాడేపల్లిగూడెం, యాగరిపల్లి కాల్వగట్టుకి చెందిన గేరక వరలక్ష్మి, మరసాని సత్యవేణి అనే ఇద్దరు మహిళలను అరెస్ట్ చేశారు. వీళ్లిద్దరిపైనా పలు కేసులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఆయా కేసుల్లో నెల్లూరుకు చెందిన షేక్ ఫక్రుద్దీన్ బిషనైని ప్రధాన నిందితుడిగా గుర్తించారు. మధ్యప్రదేశ్ గ్యాంగ్‌కు చెందిన ఐదుగురు ఉన్నారు.
ప్రధాన నిందితుడి వాంగ్మూలం ఆధారంగానే.. తాడేపల్లిగూడెం మండలంలో సాయిచంద్రారెడ్డి ఇంటి నుంచి 11 కిలోల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. పలు చోరీ కేసులకే సంబంధించి ఇప్పటికే 12 మందిని అరెస్ట్ చేసిన కాకినాడ పోలీసులు.. మరో నలుగురు కోసం గాలిస్తున్నారు. వీరిలో ఇద్దరు మధ్యప్రదేశ్‌కు చెందినవారు.. మరో ఇద్దరు నెల్లూరుకు చెందినవారు ఉన్నారు. వీరిని కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తామన్నారు ఎస్పీ బిందుమాధవ్
Also Read
- నెల్లూరులో రౌడీ షీటర్లకు వెరైటీ పనిష్మెంట్.. అలా ఉంటది ఖాకీల తో పెట్టుకుంటే
- Viral News: చెప్తే అర్థం చేసుకుంటారనుకుంది.. తల్లిదండ్రులు మోసాన్ని తట్టుకోలేకపోయింది.. చివరకు..
- Andhra Pradesh: ఛీ.. ఏం మనుషులురా.. కూతురిని కూడా వదలని తండ్రి.. నెలల పాటు దారుణంగా..
- Telangana: ప్రేమన్నాడు.. వల వేసి కోరిక తీర్చుకున్నాడు.. ఆపై వెలుగులోకి అసలు ట్విస్ట్
- Guntur: ఉలిక్కిపడ్డ గుంటూరు.! పట్టపగలు ముగ్గురు మైనర్లు చేసిన పని తెలిస్తే గుండె ఆగినంత పనవుతుంది





