SGSTV NEWS
Andhra PradeshCrime

Andhra: చెన్నైలో శ్రీకాళహస్తికి యువకుడు హత్య.. జనసేన ఇన్‌చార్జ్‌ వినుత దంపతులు అరెస్ట్



జనసేన శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ వినుత కోటను బహిష్కరించింది పార్టీ. వినుత కోట వ్యవహారశైలి పార్టీ విధానాలకు భిన్నంగా ఉన్నందున కొంతకాలం పాటు దూరం పెట్టింది జనసేన. చెన్నైలో యువకుడి హత్య కేసులో ఆరోపణలు పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. ఆ వివరాలు ఇలా..

తిరుపతి జిల్లా శ్రీకాళహస్తికి చెందిన యువకుడి హత్య చెన్నైలో కలకలం రేపింది. చెన్నైలోని కూవంనదిలో లభించిన శ్రీకాళహస్తి యువకుడి మృతదేహాంపై ఆరా తీసిన పోలీసులు జనసేన నేతల హస్తం ఉన్నట్లు గుర్తించారు. శ్రీకాళహస్తి మండలం బక్కిసంపాలెం చెందిన శ్రీనివాసులు అలియాస్ రాయుడు అనే యువకుడిగా గుర్తించిన తమిళనాడు పోలీసులు. శ్రీకాళహస్తి జనసేన ఇన్చార్జ్ కోటా వినూత వద్ద డ్రైవర్‌గా పని చేస్తున్న రాయుడుగా తేల్చారు. గత కొన్నేళ్లుగా జనసేన ఇన్‌ఛార్జ్ కోటా వినూత, ఆమె భర్త చంద్రబాబు వద్ద డ్రైవర్‌గా పని చేస్తున్న రాయుడు ప్రవర్తన బాగా లేకపోవడంతో తొలగించాల్సి వచ్చింది. ఈ మేరకు గత జూన్ 21 నుంచి డ్రైవర్ రాయుడును విధుల నుంచి తొలగించినట్లు వినూత దంపతులు సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టారు. ఈ నేపథ్యంలోనే రాయుడు అదృశ్యం అయ్యాడు.

ఆ తర్వాత చెన్నైలో రాయుడు డెడ్ బాడీ వెలుగు చూసింది. ఈ కేసులో అనుమానితులుగా 5 మంది నిందితులను అదుపులో తీసుకున్న పోలీసులు చెన్నై మింట్ పరిధిలోని సెవెల్ హిల్స్ పీఎస్‌కు తరలించారు. పోలీసులు అరెస్టు చేసిన వారిలో శ్రీకాళహస్తి జనసేన పార్టీ ఇన్‌చార్జ్ వినూత, ఆమె భర్త చంద్రబాబు ఉన్నారు. ఈనెల 8న చెన్నైలోని కూవంనది ఫోర్త్ క్రాస్‌లోని ఎంఎస్ నగర్ హౌసింగ్ బోర్డు వెనుక రాయుడు డెడ్‌బాడీని పడేసిన నిందితులను సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా గుర్తించారు. హత్య జరిగినట్లు భావించారు. నిందితుల్లో శ్రీకాళహస్తికి చెందిన శివకుమార్, గోపి, దాసర్‌లు కూడా ఉన్నారు. హత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్న పోలీసులు.. నిందితులను శ్రీకాళహస్తి తీసుకొచ్చి విచారిస్తున్నారు.

పార్టీ నుంచి బహిష్కరించిన జనసేన..
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి జనసేన ఇంచార్జ్ వినూత కోటపై వేటు పడింది. జనసేన పార్టీ నుంచి బహిష్కరిస్తూ అధిష్టానం లేఖ విడుదల చేసింది. గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా, పార్టీ విధివిధానాలకు భిన్నంగా వ్యవహరిస్తున్నట్టు లేఖలో పేర్కొన్న జనసేన అధిష్టానం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. చెన్నైలో జరిగిన హత్య కేసు వినూతపై నమోదు కావడంతో హై కమాండ్ చర్యలు చేపట్టింది

Also read

Related posts

Share this