SGSTV NEWS online
Andhra PradeshCrime

అర్థరాత్రి కానిస్టేబుల్ భార్యకు ఆ వీడియోలతో మెసేజ్.. సీన్ కట్ చేస్తే..


గురుడికి సోషల్ మీడియాలో ఓ మహిళ పరిచయమైంది.. ఇంకెందుకు ఆలస్యం వెంటనే.. ఆమెను బుట్టలో వేసుకోవాలనుకున్నాడు.. ఆ మహిళ ఎవరు..? ఏంటి అనేది తెలియక.. అర్ధరాత్రి అశ్లీల ఫోటోలు, అశ్లీల వీడియోలు, అసభ్యకర మెసేజ్‌లు పెట్టాడు.. కట్ చేస్తే, జైలు పాలయ్యాడు ఓ జిమ్ ఓనర్.. కానిస్టేబుల్ భార్యకే అసభ్యకర మెసేజ్లు పెట్టి.. జిమ్ ఓనర్ ఇరుక్కుపోయిన ఘటన ఏపీలోని అనంతపురంలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. కదిరి పట్టణానికి చెందిన లోటస్ జిమ్ నిర్వాహకుడు రమేష్ నాయక్ కు సోషల్ మీడియాలో ఓ మహిళ పరిచయమైంది. ఫేస్‌బుక్‌లో పరిచయమైన మహిళ నుంచి ఇన్‌స్టాగ్రామ్ ఐడి తీసుకున్నాడు.. అనంతరం ఇన్‌స్టాగ్రామ్ నుంచి మెసేజ్లు చేయటం ప్రారంభించాడు. పరిచయమైన మహిళ కానిస్టేబుల్ భార్య అని తెలియక.. మనోడు ఒక అడుగు ముందుకేసి.. ఆమెను ఎలాగైనా బుట్టలో వేసుకోవాలని స్పీడును పెంచాడు..

కానిస్టేబుల్ భార్యకు అర్ధరాత్రి సమయంలో అశ్లీల వీడియోలు, అశ్లీల ఫోటోలు, అసభ్యకర మెసేజులు పెట్టి జిమ్ ఓనర్ రమేష్ వేధించడం మొదలుపెట్టాడు. ఇలా అసభ్యకరంగా మెసేజ్లు పెడుతూ రమేష్ వేధిస్తూ వస్తున్నాడు.. ఇక అతని వేధింపులు భరించలేక సదరు మహిళ ఈ విషయాన్ని భర్త, ఏఆర్ కానిస్టేబుల్ నాగ బాషాకు తెలియజేసింది.

ఇంకేముంది కానిస్టేబుల్ భార్యతోనే సరసాలు ఆడతావా అని.. ఆ కానిస్టేబుల్.. జిమ్ నుంచే ఓనర్ రమేష్ ను కొట్టుకుంటూ పోలీస్ స్టేషన్ లాక్కొచ్చాడు. అనంతపురంలో ఏఆర్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న నాగ భాష, అతని భార్య కదిరి పోలీస్ స్టేషన్ లో రమేష్ పై ఫిర్యాదు చేశారు. దీంతో మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించి.. వేధిస్తున్న రమేష్ పై కేసు నమోదు చేసి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

Also read

Related posts