SGSTV NEWS online
Andhra PradeshCrime

పాడుబడ్డ కాంప్లెక్స్‌లో అనుమానాస్పదంగా కనిపించిన ఆరుగురు యువకులు.. ఏంటా అని ఆరా తీయగా..



గుంటూరులో మరోసారి ఎండిఎం డ్రగ్స్ దొరకటం కలకలం రేపింది. గతంలో గుంటూరు మీదగా డ్రగ్స్ రవాణా చేస్తున్న వారిని పోలీసులు రైడ్ చేసి పట్టుకున్నారు. ఈసారి ఏకంగా గుంటూరుకే డ్రగ్స్ తీసుకొచ్చి విక్రయించేందుకు సిద్దమైన ఆరుగురుని పాత గుంటూరు పోలీసులు పట్టుకున్నారు. పాత గుంటూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్నపూర్ణ కాంప్లెక్స్ హైవే బైపాస్ లో ఉంటుంది. ఈ కాంప్లెక్స్ లో షాపులన్నీ పూర్తిగా అద్దెకు తీసుకోలేదు. దీంతో ఆ పరిసర ప్రాంతాలు నిర్మానుష్యంగా ఉంంటాయి. ఈ క్రమంలో కొంతమంది యువకులు అసాంఘీక కార్యకలాపాలకు ఈ కాంప్లెక్స్ పరిసర ప్రాంతాలను అడ్డగా చేసుకున్నారు. ఆరుగురు యువకులు ఎండిఎం డ్రగ్ ను బెంగళూరు నుండి తీసుకొచ్చి చిన్న చిన్న ప్యాకెట్లుగా మారుస్తున్న విషయాన్ని పోలీసులు పసిగట్టారు. వీరిపై నిఘా ఉంచగా కాంప్లెక్స్ వెనుక వైపు అందరూ గుమికూడి ఉన్నట్లు సమాచారం వచ్చింది. వెంటనే పోలీసులు దాడి చేయగా 17 గ్రాముల ఎండిఎం లభ్యమైంది.

బెంగళూరు నుండి తీసుకొచ్చిన యువకులు దాన్ని విక్రయించేందుకు చిన్న చిన్న ప్యాకెట్లుగా మారుస్తున్నారు. అదే సమయంలో పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. డ్రగ్స్ కొనుగోలు చేసిన యువకులు ఎవరికి అనుమానం రాకుండా డబ్బులను ఆన్ లైన్ లోనే చెల్లించారు. అయితే అక్కడ నుండి ఎలా తరలించారనే అంశం ఇంకా తేలలేదు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆరుగురి అరెస్ట్ చేసిన పోలీసులు వారి వద్ద నుండి 17 గ్రాముల డ్రగ్ స్వాధీనం చేసుకున్నారు.

ఎండిఎం డ్రగ్ సింథటిక్ డ్రగ్ అని కొన్ని కెమికల్స్ కలిపి తయారు చేస్తారని ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. అధిక మొత్తంలో మత్తు ఇస్తుందని దీంతో కొంతమంది దీనిని అక్రమంగా రవాణా చేస్తూ విక్రయిస్తున్నారన్నారు. గంజాయి, డ్రగ్స్ విక్రయాలపై ప్రత్యేక ద్రుష్టి పెట్టినట్లు ఆయన చెప్పారు. ఈ డ్రగ్ కు అలవాటు పడితే త్వరగా బయటకు రాలేరని తల్లిదండ్రులు ఎప్పటికప్పుడూ తమ పిల్లల ప్రవర్తనపై ద్రుష్టి పెట్టాలన్నారు

Also Read

Related posts