అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం బిక్కింవారిపల్లి కి చెందిన యువతి బెంగళూరులో దారుణ హత్యకు గురైంది. రామసముద్రం మండలం బిక్కింవారిపల్లికి చెందిన రెడ్డప్ప రెండో కూతురు 21 ఏళ్ల దేవిశ్రీ బెంగళూరులోని మాధనాయకనహళ్లిలో స్నేహితురాలి రూమ్ లో హత్యకు గురైంది. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దీంతో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
గత ఆదివారం (నవంబర్ 23) నుంచి దేవి శ్రీ నుంచి ఎలాంటి ఫోన్ రాకపోవడంతో తల్లిదండ్రులకు అనుమానం వచ్చింది. దేవి శ్రీ రూమ్ మేట్‌కు కాల్ చేసి ఆరా తీశారు తల్లిదండ్రులు. దేవిశ్రీ ఎక్కడికెళ్ళిందో తెలుసుకునే ప్రయత్నం చేశారు. మాధనాయకనహళ్లిలో ఉన్న మరో ఫ్రెండ్ వద్దకు వెళుతున్నట్లు చెప్పి రూమ్ నుంచి వెళ్ళిపోయినట్లు తెలుసుకున్నారు. ఏ స్నేహితురాలు రూంకు దేవి శ్రీ వెళ్తానని చెప్పిందో ఆ ఫ్రెండ్ కు ఫోన్ చేయడంతో అసలు విషయం బయటపడింది.
ఆదివారం తన రూమ్ కు దేవిశ్రీ ప్రేమవర్ధన్ అనే యువకుడిని తీసుకొచ్చిందని, దీంతో వాళ్లు ఒంటరిగా మాట్లాడుకునేందుకు వీలుగా రూమ్ నుంచి బయటకు వచ్చానని ఆమె స్నేహితురాలు చెప్పింది. తాను ఇప్పుడు రూముకు వెళ్తున్నానని కొద్దిసేపట్లోనే ఫోన్ చేయిస్తానని చెప్పిన యువతి రూమ్ వద్దకు చేరుకోగానే గదికి తాళం వేసి ఉండడంతో అనుమానం వచ్చింది. దేవి శ్రీ, ప్రేమవర్ధన్ లకు కాల్ చేసినా అందుబాటులోకి రాకపోవడంతో కిటికీలో నుంచి గదిలోకి చూసింది. ఆ యువతి రూమ్ లో దేవిశ్రీ నిగతజీవిగా పడి ఉన్నట్లు గుర్తించింది.
వెంటనే కేకలు వేయడంతో చుట్టుపక్కన ఉన్నవారు అప్రమత్తమై పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దేవి శ్రీ డెడ్ బాడీని పోస్ట్‌మార్టంకు తరలించి ఆధారాలు సేకరించారు. దేవి శ్రీ తల్లిదండ్రులకు ఘటనపై సమాచారం ఇచ్చారు. ఆదివారం రాత్రికి రాత్రే బెంగళూరు చేరుకున్న దేవి శ్రీ తల్లిదండ్రులు బంధువులను విచారించిన పోలీసులు దేవి శ్రీ ప్రేమ వ్యవహారాన్ని తెలుసుకున్నారు.
పుంగనూరులో ఇంటర్ చదువుతున్న సమయంలో దేవి శ్రీ, ప్రేమవర్ధన్ మధ్య పరిచయం ఉందని గుర్తించారు. ఈ నేపథ్యంలోనే ఇద్దరి మధ్య కొన్నేళ్లుగా ప్రేమ వ్యవహారం నడుస్తున్నట్లు తెలుసుకున్నారు. రామసముద్రం మండలం బిక్కింవారిపల్లి కి చెందిన రెడ్డెప్ప రెండో కూతురు 21 ఏళ్ల దేవిశ్రీ బెంగళూరు లోని ఒక ప్రైవేట్ కళాశాలలో బీబీఏ చదువుకుంటూ.. పిజిలో ఉంటుండగా తరచూ ప్రేమవర్ధన్ దేవి శ్రీ కోసం వచ్చిపోతున్నట్లు తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రేమవర్ధన్ బెంగళూరుకు వచ్చి దేవి శ్రీని హతమార్చినట్లు పోలీసులు నిర్ధారించారు.
దేవిశ్రీ, ప్రేమవర్ధన్ మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ దిండుతో ఊపిరాడకుండా చేసి దేవి శ్రీని హతమార్చినట్టు పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. దేవి శ్రీని హతమార్చి నేరుగా మదనపల్లికి చేరుకున్న ప్రేమవర్ధన్ తల్లిదండ్రులకు స్నేహితులకు ఫోన్ చేసి బోయకొండ ప్రాంతంలో ఉన్న చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు చెప్పాడు. దీంతో అప్రమత్తమైన పేరెంట్స్, ఫ్రెండ్స్ వెంటనే చౌడేపల్లి పోలీసులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన బోయకొండ చెరువు వద్దకు పోలీసులు చేరుకుని ఫోన్ చేసి ఆరా తీశారు. ఫోన్ పని చేయకపోవడంతో చెరువు వద్ద గాలించారు.
ఆదివారం అర్ధరాత్రి 11.30 గంటల సమయంలో సోమల ప్రాంతంలో ప్రేమవర్ధన్ మొబైల్ ఆన్ కావడంతో ఊపిరి పీల్చుకున్న పోలీసులు అక్కడి నుంచి వెనుతిరిగారు. ప్రేమవర్ధన్ ఇంటికి రాకపోవడంతో సోమవారం ఉదయం తల్లిదండ్రులు చౌడేపల్లి పీఎస్ కు చేరుకుని మిస్సింగ్ కేసు నమోదు చేసేందుకు ప్రయత్నించారు. అయితే అప్పటికే ప్రేమవర్ధన్ బండారం బయటపడటంతో పోలీసులు కేసు నమోదు చేయకుండా అజ్ఞాతంలో ఉన్న ప్రేమవర్ధన్ కోసం గాలిపుచర్యలు చేపట్టారు. ఈలోపే బెంగళూరు పోలీసుల నుంచి కూడా చౌడేపల్లి, రామసముద్రం పోలీస్ స్టేషన్ లకు ఫోన్ కాల్స్ రావడంతో దేవిశ్రీని హత్య చేసిన ప్రేమ వర్ధన్ ఆచూకీ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. దేవిశ్రీ డెడ్ బాడీని స్వగ్రామం తీసుకొచ్చి తల్లిదండ్రులు అంత్యక్రియలు కూడా పూర్తి చేశారు. ప్రేమ పేరుతో వంచించి మోసం చేసి హత్య చేసిన ప్రేమవర్ధన్ ను కఠినంగా శిక్షించాలని దేవి శ్రీ పేరెంట్స్ డిమాండ్ చేస్తున్నారు.
Also Read
- Ratha Saptami 2026: దరిద్రం వదిలి ఐశ్వర్యం వస్తుంది!.. రథ సప్తమి నాడు ఏ రాశి వారు ఏం దానం చేయాలి?
- Moon Transit: చంద్ర సంచారం.. ఈ మూడు రాశులకు జాక్పాట్.. ఊహించని లాభాలు!
- భార్యను చంపేశానంటూ పోలీస్ స్టేషన్లో లొంగిపోయిన భర్త.. విచారణలో సంచలనాలు..!
- జైల్లో ఉన్న భర్తను బెయిల్పై బయటకు తెచ్చిమరీ చంపిన భార్య.. అసలు కారణం తెలిస్తే
- బెజవాడ అడ్డాగా గలీజ్ దందా..! వయా బంగ్లాదేశ్, కోల్కతాతో లింకులు బట్టబయలు..





