పల్నాడు జిల్లా మాదలలో కన్నతల్లినే హత్య చేసిన ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా ఈ హత్య కలకలం రేపింది. గ్రామానికి చెందిన ఆకుల సీతారావమ్మను ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం అడవిపాలెంకు చెందిన పుల్లయ్యకు ఇచ్చి వివాహం చేశారు. సీతారవమ్మకు ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుక్కి తన అన్న కూతరిని ఇచ్చి వివాహం చేసింది. అయితే పదేళ్ల క్రితం భర్త పుల్లయ్య చనిపోయాడు. పెద్ద కొడుకు కూడా చనిపోవడంతో కోడలు మాదలలోనే ఉంటుంది. పెద్ద కోడలు వ్యవసాయ పనులు చేసుకుంటూ పిల్లల్ని చదివించుకుంటుంది. సీతారావమ్మ అడవిపాలెంలో చిన్నకొడుకు బాజీ, అతని భార్యతో కలిసి జీవిస్తుంది. అయితే బాజీ గత కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. దీంతో బాజీ భార్య కూడా పుట్టింటికి వెళ్లిపోయింది.
బాజీ మద్యం సేవించి వచ్చి ఇంటి వద్ద తల్లితో గొడవ పడుతున్నాడు. దీంతో ఆమె అతని బారి నుండి తప్పించుకునేందుకు పెద్ద కోడల వద్దకు వచ్చింది. అక్కడే ఉన్న సంగతి బాజీకి తెలిసింది.
తన తల్లి సీతారావమ్మ వెళ్లి వదిన ఆమె పిల్లలు వద్ద ఉంటాన్ని తెలుసుకున్న బాజీ నిన్న మాదల గ్రామం వచ్చాడు. అప్పటికే వదిన కూలీ పనులకు వెళ్లిపోయింది. పిల్లలు బడికి వెళ్లారు. ఇంట్లో సీతారావమ్మ ఒక్కతే ఉంది. ఇంటికి వచ్చిన బాజీ తల్లితో గొడవ పడ్డాడు. అడవిపాలెం రావాలంటూ ఆమెపై ఒత్తిడి చేశాడు. తన భార్యను కూడా తీసుకురావాలని చెప్పాడు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య మాటామాట పెరిగింది. దీంతో ఇంట్లో ఉన్న కత్తి తీసుకొని ఆమె గొంతు కోశాడు. తీవ్ర గాయంతో సీతారావమ్మ అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. తల్లిని అలానే వదిలేసి బాజి అక్కడ నుండి వెళ్లిపోయాడు.
అయితే బాజి వెళ్లిపోవడాన్ని స్థానికులు కొంతమంది గుర్తించారు. సాయంత్రం పెద్ద కోడలు ఇంటికొచ్చేసరికి అత్త సీతారావమ్మ రక్కపు మడుగులో పడిపోయి ఉంది. దీంతో ఆమె పెద్దగా కేకలు వేసింది. స్థానికులు వచ్చి పోలీసులకు ఫోన్ చేశారు. మద్యాహ్న సమయంలో ఇంటి నుండి సీతారావమ్మ చిన్న కొడుకు బాజీ వెళ్లిపోవడాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో అతని కోసం గాలింపు చేపట్టారు. త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు.
Also read
- చదువులపై ‘యమ’ ఒత్తిడి.. ఇంట్లో ఉరివేసుకుని BTech విద్యార్థి ఆత్మహత్య
- ఆదివారం, గురువారం వస్తుందంటే వణికిపోతున్న ఊరి జనం.. అంతుచిక్కని పూజలతో భయం భయం!
- అన్నం పెట్టిన సంస్థకే కన్నం.. ఎయిర్టెల్ ఉద్యోగులే దొంగలు.. రాత్రికి రాత్రే మాయం.. చివరకు
- పెద్ద స్కెచ్చే ఇది.. యూట్యూబర్ మీనాక్షి అరెస్ట్..
- ”ఏమైంది బిడ్డా.. లే అమ్మా.. నా గతి ఏం కావాలె!”





