పార్వతీపురం మన్యం జిల్లాలో వనభోజనాల్లో తీవ్ర విషాదం నెలకొంది. అనంతగిరి మండలం జీనబాడులో ఈ ఘటన చోటు చేసుకుంది. రైవాడ జంజవతి రిజర్వాయర్‌లో ముగ్గురు వ్యక్తులు గల్లంతయ్యారు. ఈ ఘటనలో ఇప్పటివరకు ఒకరి మృతదేహం బయటపడింది. మిగిలినవారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. కేవలం ఒక్కరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. ప్రమాదానికి ముందు పడవలో మొత్తం నలుగురు వ్యక్తులు ప్రయాణించినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు ప్రత్యేక సహాయక బృందాలతో గల్లంతైన వారి కోసం గాలింపు చేపట్టారు.
కార్తీక వనభోజనాల్లో భాగంగా జంజవతి రిజర్వాయర్ వద్దకు పిక్నిక్ కోసం సివిని గ్రామానికి చెందిన పలు కుటుంబాలు వెళ్లాయి. ఈ క్రమంలో ఆడుకుంటూ నలుగురు విద్యార్థులు రిజర్వాయర్‌లోకి దిగారు. ప్రమాదవశాత్తు విద్యార్థులు గల్లంతయ్యారు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు, గజఈతగాళ్ల సాయంలో సహాయకచర్యలు చేపట్టారు. అయితే, గల్లంతైన వారిని అధికారి గోవిందనాయుడు, అరసాడ ప్రదీప్, రాయగడ శరత్ గా గుర్తించారు. వారంతా కొమరాడ మండలం సివిని గ్రామానికి చెందినవారిగా తెలుస్తోంది. ఈ విషాద ఘటన బాధిత కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.
Also Read
- ఇంట్లో నేలపై పాకుతూ బల్లి కనిపిస్తే శుభమా? అశుభమా? శాస్త్రం, నమ్మకాలు చెప్పేదేమిటి?
- పుట్టుకతోనే దైవ అనుగ్రహం పొందిన రాశులు ఇవే.. మీ రాశి కూడా ఈ జాబితాలో ఉందా?
- నేటి జాతకం లు 14 జూన్, 2026
- కలికాలం.. ఇలాంటి ఫ్రెండ్స్‌తో జాగ్రత్త.. అప్పు ఇవ్వలేదని వెంచర్‌కు తీసుకెళ్లి..
- మీరేం మనుషులురా.. రూ.20 కోసం చిల్లర గొడవ.. కాపాడడానికి వెళ్తే కొట్టి చంపేశారు..





