April 3, 2025
SGSTV NEWS
CrimeTelangana

Crime News: 2ఏళ్లు సహజీవనం.. పెళ్లి చేసుకుని తల్లి సాయంతో భర్త గొంతుకోసి కిరాతకం!


బెంగళూరులో దారుణం జరిగింది. తల్లి సాయంతో ఓ భార్య తనభర్తను కసాకసా గొంతుకోసి చంపింది. 2ఏళ్లు సహజీవనం చేసి పెళ్లి చేసుకుంది ఓ జంట. తర్వాత భర్త వివాహేతర సంబంధాలు, అక్రమ వ్యాపార లావాదేవీలు తెలియడంతో అతడిని కాటికి పంపింది.

ఈ మధ్య కాలంలో భార్య భర్తల మధ్య సంబంధాలు బలపడుతున్నాయి. చిన్న చిన్న విషయాలకే గొడవలు పడి చంపుకుంటున్నారు. కట్టుకున్నవాళ్లే కాసాయిలుగా మారుతున్నారు. తాజాగా బెంగళూరులో మరో ఘటన వెలుగులోకి వచ్చింది. 2 ఏళ్లు లివింగ్ రిలేషన్‌షిప్‌లో ఉన్న ఓ జంట.. గత ఏడాది డిసెంబర్‌లో పెళ్లి చేసుకుంది. ఈ విషయం రీసెంట్‌గా ఆ అమ్మాయి పేరెంట్స్‌కు తెలిసింది.

ఈ క్రమంలోనే ఆ యువకుడి బయోడేటా బయటకు తీశారు. దీంతో విస్తుపోయే విషయాలు వారికి తెలిసాయి. అదే విషయంలో భార్య, భర్తల మధ్య గొడవలు జరిగాయి. అతడు కాస్త పేరుగల వ్యక్తి కావడంతో ఆ యువతితో పాటు ఆమె పేరెంట్స్‌ను బెదిరించాడు. ఇక లాభంలేదని భావించిన ఆ యువతి, ఆమె తల్లి.. అతడిని కాటికి పంపేందుకు నిర్ణయించుకున్నారు. భోజనంలో నిద్రమాత్రలు కలిపి.. విశాల ప్రాంతానికి తీసుకెళ్లి కసా కసా పొడిచి పారిపోయారు. స్థానికులు చూసి పోలీసులకు సమాచారం అందించగా.. గుట్టు రట్టయింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేసి తల్లి, కూతురిని అదుపులోకి తీసుకున్నారు

భర్త గొంతుకోసిన భార్య, అత్త
పోలీసులు కథనం ప్రకారం.. రియల్ ఎస్టేట్ వ్యాపారి అయిన లోక్‌నాథ్ సింగ్ (37) పెళ్లి కాకముందు.. తన భార్యతో రెండేళ్లు లివింగ్ రిలేషన్‌షిప్‌లో ఉన్నాడు. వీరి ఇద్దరి మధ్య వయసు గ్యాప్ ఎక్కువగా ఉండటంతో ఆ యువతి ఫ్యామిలీ పెళ్లికి నిరాకరించింది. కానీ ఈ జంట గత ఏడాది డిసెంబర్‌లో కునిగల్‌లో పెళ్లి చేసుకున్నారు. ఆ విషయం ఆ యువతి పేరెంట్స్‌కు తెలియదు.

ఇక పెళ్లి చేసుకున్న అనంతరం లోక్‌నాథ్ తన భార్యను.. ఆమె తల్లిదండ్రుల వద్దే వదిలేసి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి ఆ యువతి తన ఇంట్లో మేనేజ్ చేస్తూ వచ్చింది. చివరికి రెండు వారాల క్రితమే లోక్‌నాథ్‌తో పెళ్లి జరిగినట్లు ఆ యువతి కుటుంబ సభ్యులకు తెలిసింది. దీంతో లోక్‌నాథ్ గురించి ఎంక్వరీ చేయగా.. అతడి వివాహేతర సంబంధాలు, అక్రమ వ్యాపార లావాదేవీలు బయటపడ్డాయి

ఇదే విషయంపై లోక్‌నాథ్, తన భార్య మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉన్నాయి. దీంతో విడాకులు కోసం ఆ యువతి గొడవ చేసింది. అలా జరిగితే తన బండారం బయటపడుతుందని లోక్‌నాథ్ తన పలుకుబడితో ఆ యువతితో పాటు, అత్తమామలను బెదిరించాడు. దీంతో లోక్‌నాథ్‌ను ఖతం చేయాలని భార్య, అత్త పథకం రచించారు. ఇంటికి వచ్చిన లోక్‌నాథ్‌కు భోజనంలో నిద్ర మాత్రలు వేసి కలిపి ఇచ్చారు. అతడు నిద్రలోకి జారుకోగానే ఎవరూ లేని ప్రాంతంలోకి వెళ్లి కత్తితో కసాకసా గొంతుకోసి పారిపోయారని దర్యాప్తులో తేలినట్లుగా పోలీసులు పేర్కొన్నారు. ఈ హత్యకు ప్రధాన కారణం.. లోక్‌నాథ్ వివాహేతర సంబంధాలు, అక్రమ వ్యాపార లావాదేవీలే అని పోలీసులు చెప్పారు. 

Also read

Related posts

Share via