April 11, 2025
SGSTV NEWS
CrimeNational

యూనివర్సిటీ వాటర్ ట్యాంక్లో మహిళ మృతదేహం.. పరారీలో భర్త, అత్త? ..?

లక్నో: ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో ఘోరం వెలుగుచూసింది. గౌతమ్ బుద్దా యూనివర్సిటీలోని స్టాఫ్ క్వార్టర్స్ భవనంలోని వాటర్ ట్యాంక్ లో ఓ మహిళ మృతదేహం లభ్యమైంది. దీంతో భయాందోళనలకు గురైన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

మహిళ తన భర్త, అత్తతో కలిసి అక్కడే నివసించినట్లు పోలీసుల విచారణలో తేలింది. మహిళను భర్త, అత్తే హత్య చేసి అక్కడి నుంచి పరారై ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. మహిళ భర్త సమీపంలోని జిమ్స్ ఆసపత్రిలో పనిచేస్తున్నట్లు తేలింది. దంపతుల మధ్య తరుచూ గొడవలు జరిగేవని స్థానికులు పోలీసులకు తెలిపారు.

ఆదివారం రాత్రి కూడా గొడవ జరిగిందని చెప్పారు. ఆ గొడవే మహిళ హత్యకు దారి తీసి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మృతురాలి భర్త, అత్త కోసం గాలిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించినట్లు సీనియర్ పోలీసు అధికారి శివహరి మీనా తెలిపారు. కేసుపై అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నామని, త్వరలోనే వాస్తవాలను బయటపెడతామని చెప్పారు.

Also read

Related posts

Share via