April 14, 2025
SGSTV NEWS
CrimeNational

మరీ ఇలా చేశావేంటయ్యా..భార్య చనిపోయిందని భర్త ఏం చేశాడంటే? ఇద్దరు పిల్లల్ని…



ప్రేమించిన అమ్మాయి తనను కాదని వేరే వాళ్లను పెళ్లి చేసుకుందని కిరాతకంగా ప్రాణాలు తీసే ఈ రోజుల్లో ప్రేమించిన అమ్మాయి కోసం ప్రాణాలు ఇచ్చే వాళ్లు కూడా ఉన్నరని కర్ణాటకలో జరిగిన ఘటన మరోసారి నిరూపించింది. ప్రేమ ఉండొచ్చు.. మరీ భార్యపై ప్రేమతో ఎవరైనా కన్న పిల్లిల్ని చంపుకుంటారా? కానీ ఇక్కడ అదే జరిగింది. ప్రాణంగా ప్రేమించే భార్య చనిపోయిందని ఓ వ్యక్తి ఇద్దరి పిల్లల్ని చంపి తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మన పక్కరాష్ట్రమైన కర్ణాటక జిల్లాలోని దావణగెరెలో చోటుచేసుకుంది.


పోలీసుల వివరాల ప్రకారం..

కర్ణాటక రాష్ట్రంలోని దావణగెరె జిల్లా గాంధీనగర్‌లో నివాసం ఉంటున్న ఉదయ్‌ ఈ దారుణమైన నిర్ణయం తీసుకున్నాడు. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన భార్య చనిపోవడంతో తన ఇద్దరి పిల్లలను చంపి తను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. చనిపోయే ముందు ఏడు పేజీల సూసైడ్‌ నోట్‌ కూడా రాశాడు. భార్యపై తనకున్న అమితమైన ప్రేమను ఆ నోట్‌లో వివరించాడు. తన భార్యతో కలిసి ఉండడం కోసం, పిల్లలతో కలిసి వెళ్లిపోతున్నట్టు రాసుకొచ్చాడు. ఉదయ్‌ రాసిన ఈ సూసైడ్‌ నోట్‌ చూస్తుంటే కన్నీళ్లు ఆగటం లేదు. అసలు ఏం జరిగింది. అతని భార్య ఎలా చనిపోయింది?

హబేరి జిల్లాలోని రాణేబెన్నూర్ తాలూకా చలనారే ప్రాంతానికి చెందిన ఉదయ్‌, అదే ప్రాంతానికి చెందిన హేమ కొన్నాళ్లుగా ప్రేమించుకొని 2015లో వివాహం చేసుకున్నారు. తర్వాత వీరికి ఓ కూతురు, కొడుకు పుట్టారు. కూతురు సింధుశ్రీ నాగేళ్లు ఉండగా, కుమారుడు శ్రీజయ్‌కు మూడేళ్లు ఉన్నాడు. అయితే కొన్ని అనారోగ్య కారణాలతో 8 నెలల క్రితం ఉదయ్ భార్య హేమ మరణించింది. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన భార్య తనను వదిలేసి వెళ్లడంతో ఉదయ్ డిప్రెషన్‌లోకి వెళ్లాడు. దీంతో అతని మానసిక పరిస్థితి రోజురోజుకూ క్షీణించడం ప్రారంభమైంది. ఇక భార్య లేకుండా తన జీవించలేనని నిర్ణయించుకున్న ఉదయ్ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. కానీ తాను కూడా వెళ్లిపోతే పిల్లల పరిస్థితి ఏమవుతుందోనని ఆందోళన చెందాడు. తనతో పాటు పిల్లలను కూడా తీసుకెళ్దామని నిశ్చయించుకున్నాడు. ఇద్దరు పిల్లలను గొంతు కోసి చంపేశాడు. తర్వాత తాను ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే చనిపోయే ముందు భార్య కోసం ఇంటి గోడపై ఉదయ్ ఐ లవ్‌ యూ అని రాసినట్టు పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. స్పాట్‌లో దొరికిన సూసైడ్‌ నోట్‌ను స్వాధీనం చేసుకొని ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు

Also read

Related posts

Share via