November 21, 2024
SGSTV NEWS
CrimeNational

ఆమెని ప్రాణంగా ప్రేమించాడు! పెళ్ళైన తరువాత ఓ రాత్రి బయటకి పిలిచి!

Maharashtra: దేశంలో ఇప్పటికే కులాలు, మతాలు అంటే కొన్ని ప్రాంతాల ప్రజలు ప్రాణాలు ఇస్తారు.. తేడా వస్తే ప్రాణాలు తీస్తారు. కులాంతర వివాహాలు చేసుకుంటే వారిని దారుణంగా హత్యలు చేస్తున్న ఘటనలు ఎన్నో వెలుగు చూశాయి.

Also read :ఏపీలో మరో మూడు నెలలు ఆ బ్రాండ్‌లే అమ్మకం… కొత్త మద్యం పాలసీ వచ్చేది అప్పుడే…

ప్రస్తుతం భారత దేశం ప్రపంచ దేశాలతో పోటీ పడి అన్ని రంగాల్లో ముందుకు సాగుతుంది. సాంకేతిక రంగంలో అద్భుతాలు సృష్టిస్తుంది. జాబిల్లిపై చంద్రయాన్ 3 ప్రవేశ పెట్టినపుడు అన్ని దేశాలు భారత్ వైపే చూశాయి. ఇంత అభివృద్ది చెందుతున్న భారత్ లో కొన్ని ప్రాంతల ప్రజలు ఇప్పటికీ కులాలు, మతాలు అంటూ కొట్టుకుంటూనే ఉన్నారు. దేశంలో ఎక్కడో అక్కడ పరువు హత్యలు జరుగుతూనే ఉన్నాయి. తమ కులం వారిని కాదని పెళ్లి చేసుకున్న జంటపై దారుణంగా దాడులు, హత్యలకు పాల్పపడుతున్న ఘటనలు ఎన్నో వెలుగు చూస్తున్నాయి. తాజాగా అలాంటి ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

Also read :Sircilla Police: అందులో రాష్ట్రంలో నెం.1 స్థానం.. సిరిసిల్ల జిల్లా పోలీసుల ఘనత

మహారాష్ట్రలో మరో పరువు హత్య చోటు చేసుకుంది. చత్రపతి శంభాజీ నగర్ లో ఉంటున్న విద్య తన భర్త అమిత్ సాలుంకే మృతితో కన్నీరు మున్నీరవుతుంది. విద్యా కీర్తి షాహి, అమిత్ సాలుంకే లు కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. అమిత్ ని ప్రేమించడం, పెళ్లి చేసుకుంటా అనడం విద్య కుటుంబ సభ్యులకు, కజిన్స్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ క్రమంలోనే వారిని కాదని పూణే వెళ్లి 2024 మే 2న గుడిలో ప్రేమ వివాహం చేసుకున్నారు. మృతుడి భార్య విద్య మాట్లాడుతూ.. పెళ్లైన తర్వాత నెల రోజుల పాటు పూణేలో ఉన్నాం. ఆ సమయంలో మాకు ఎన్నో బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఊరు కాని ఊరిలో మాకు ఏమైనా జరిగితే దిక్కు ఉండదు అన్న భయంతో శంభాజీనగర్‌ కి తిరిగి వచ్చాం. మా పెళ్లికి అమిత్ సాలుంకే కుటుంబ సభ్యులు ఓకే చెప్పి మళ్లీ మాకు పెళ్లి జరిపించారు.

Also read :Sircilla Police: అందులో రాష్ట్రంలో నెం.1 స్థానం.. సిరిసిల్ల జిల్లా పోలీసుల ఘనత

ఈ నెల జులై 14న అమిత్ ఇంట్లో ఉన్నపుడు అతని స్నేహితుడు నుంచి కాల్ వచ్చింది. ఆన్ లైన్ గేమ్ ఆడటానికి రావి చెట్టు వద్దకు రమ్మన్నాడు.. అమిత్ అక్కడికి వెళ్లాడు. అప్పనా హెబ్ కీర్తి షాహి వెనుక నుంచి వచ్చి నాభర్తను 8 సార్లు పొడిచి పొడిచి హత్య చేశాడు.నా భర్త రక్తపు మడుగులో పడి కొట్టుకుంటున్నాడు.. వెంటనే ఆస్పత్రికి తీసుకువెళ్లాం. 12 రోజు పాటు మృత్యువుతో పోరాడి జులై 25న కన్నుమూశాడు. నా భర్త చనిపోయే ముందు నా చేతులు పట్టుకొని ఎంతగానో ఏడ్చాడు. జులై 26న అంత్యక్రియలు నిర్వహించాం. నా భర్తను చంపిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశాను. ఛత్రపతి శంభాజీనగర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ మాట్లాడుతూ.. యువతీ,యువకుడు కులాంతర వివాహం చేసుకున్నారు. వారి కుటుంబాల మధ్య విభేదాలు ఈ హత్యకు కారణమా? అతనికి మరెవరైనా శత్రులువు ఉన్నారా? అన్న కోణంలో కేసు దర్యాప్తు చేస్తున్నామని, నిందితులను పట్టుకునేందుకు రెండు బృందాలు పనిచేస్తున్నాయని అన్నారు.

Also read :అదే ఆఖరి సెల్ఫీ అయింది.. ముగ్గురూ సరదగా ప్రాజెక్టు వద్దకు వెళ్లారు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

Bizarre: బాబోయ్ కోళ్ల దొంగలు.. రెండ్రోజుల్లో ఏకంగా 30 కోళ్లు మాయం.. రెక్కి నిర్వహించి మరీ..!

Related posts

Share via