November 21, 2024
SGSTV NEWS
Andhra PradeshCrime

ఇన్సూరెన్సు ఫ్రాడ్ : సినిమా స్టోరీని మరిపించాడుగా.. ఇన్సూరెన్స్ కోసం బతికే ఉన్నా చనిపోయినట్లు క్రియేట్ చేసి..!

తాను బతికే ఉన్నప్పటికీ ఫారుక్ భాషా చనిపోయినట్లుగా.. సజీవ దహనమైనట్లుగా చుట్టుపక్కల వారిని సైతం కుటుంబ సభ్యులు నమ్మించారు.

Insurance Fraud : ఇన్సూరెన్స్ కోసం ఒకరిని చంపడం లేదా తాను చనిపోయినట్టుగా నమ్మించడం వంటి సీన్లను చాలా సినిమాల్లో చూసే ఉంటాం. ఇప్పుడు అచ్చం అలాంటి సినిమా మిస్టరీ తలపించేలా ఉన్న ఘటన నంద్యాలలోని పాములపాడులో చోటుచేసుకుంది. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ఏకంగా తనకు తానే చనిపోయినట్లు క్రియేట్ చేశాడో ప్రబుద్ధుడు

అతడే ఫారుక్ భాషా. కుటుంబ సభ్యులతో కలిసి నటనను బాగానే రక్తి కట్టించాడు. చూస్తుంటే.. సినిమా స్టోరీనే మరిపించాడు భాషా. అతడు ఆడిన నాటకంలో కుటుంబ సభ్యులు కూడా సినిమాలో లాగానే నటనలో జీవించారు. తాను బతికే ఉన్నప్పటికీ ఫారుక్ భాషా చనిపోయినట్లుగా.. సజీవ దహనమైనట్లుగా చుట్టుపక్కల వారిని సైతం కుటుంబ సభ్యులు నమ్మించారు.

కాకినాడలో కనిపించిన ఫారుక్ భాషా :
అసలేం జరిగిందంటే.. ఈ ఏప్రిల్ ఒకటవ తేదీన ఏకే ట్రేడర్స్‌లో గోదాం దగ్దమైంది. ఆ గోదాంలో ప్రతాప్ అనే వ్యక్తి సజీవ దహనమయ్యాడు. అయితే, అతడు తన భర్త వడ్ల ఫారుక్ భాషానే సజీవ దహనం చేశారంటూ భార్య స్వరూప, కుటుంబ సభ్యులు ఆరోపించారు. అంతటితో ఆగలేదు.. మైనార్టీ సంప్రదాయం స్మశాన వాటికలో ప్రతాప్‌కు దహన సంస్కారాలు కూడా చేశారు ఫారుక్ భాషా కుటుంబ సభ్యులు. అందరూ చనిపోయాడని నమ్మిన వడ్ల ఫారుక్ భాషా.. కొద్దిరోజుల క్రితం కాకినాడలో కొంతమందికి తారసపడ్డాడు.

చనిపోయిన వ్యక్తి ఎలా బతికి వచ్చాడనే అనుమానం స్థానికుల్లో కలగడంతో ఈ సినిమా మిస్టరీ వెలుగులోకి వచ్చింది. స్థానికుల ఫిర్యాదు మేరకు వడ్ల ఫారుక్ భాషా కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. భాషా కుటుంబ సభ్యులను కూడా పోలీసులు విచారణ చేస్తున్నట్లు సమాచారం. మృతుడు ప్రతాప్ భార్య ఫిర్యాదు మేరకు పాములపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also read

Related posts

Share via