మలక్ పేట్‌లోని శాలివాహన పార్క్‌లో సీపీఐ నాయకుడు చందునాయక్ ను ప్రత్యర్థులు ఈ ఉదయం కాల్చి చంపిన విషయం తెలిసిందే. కాగా ఈ విషయమై చందు నాయక్ భార్య నారి భాయ్ హాట్ కామెంట్స్ చేశారు. నా భర్తను చంపిన వాళ్లను నేనే చంపుతానని తన ఆవేదనను వెల్లడించారు
Crime:మలక్ పేట్‌లోని శాలివాహన పార్క్‌లో సీపీఐ నాయకుడు చందునాయక్ ను ప్రత్యర్థులు ఈ ఉదయం కాల్చి చంపిన విషయం తెలిసిందే. కాగా ఈ విషయమైచందు నాయక్ భార్య నారి భాయ్ హాట్ కామెంట్స్ చేశారు. నా భర్తను చంపిన వాళ్లను నేనే చంపుతానని తన ఆవేదనను వెల్లడించారు. నా భర్తకు ఎన్ని బుల్లెట్లు దిగాయో.. హంతకులకు కూడా అన్ని బుల్లెట్లు దిగాలన్నారు. కాల్పులు జరిపినవారిలో ఒకరిని గుర్తు పడతా…. మొత్తం ఆ సమయంలో ముగ్గురిని చూశానని చెప్పారు చందు నాయక్ భార్య నారి భాయ్. దింతో చందు నాయక్ భార్య నారి భాయ్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఇది ఇలా ఉండగా.. ఇవాళ తెల్లవారుజామున మలక్ పేటలో సీపీఐ నాయకులు చందు నాయక్ పై దుండగులు కాల్పులు జరిపారు. ఈ సంఘటనలో చందు నాయక్ అక్కడికక్కడే మృతి చెందారు. దీనికి సంబంధించిన సంఘటన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది.
మలక్ పేట్‌లోని శాలివాహన పార్క్‌లో వాకర్ పై కాల్పులు జరిగిన సంఘటన మంగళవారం ఉదయం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అచ్చంపేట నాగర్ కర్నూల్‌కు చెందిన చందు నాయక్ అనే వ్యక్తి పై గుర్తుతెలియని దుండగులు కారం చల్లి ఆయనపై తుపాకితో నాలుగు రౌండ్లు కాల్పులు జరపడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. చందు నాయక్ సీపీఐ రాష్ట్ర కమిటీ సభ్యులుగా కొనసాగుతున్నారు. రోజువారి దినచర్యలో భాగంగా తన భార్య, కూతురుతో కలిసి శాలివాహన పార్క్‌లో వాకింగ్ చేస్తుండగానే ఆయన పై కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది.
అయితే ఈ సంఘటన జరిగిన కొద్ది గంటలకే నలుగురు నిందితులు లొంగిపోయినట్లు తెలుస్తోంది. ఇందులో రాజేష్, శివ తో పాటు మరో ఇద్దరు ఉన్నారు. నలుగురు పక్కా ప్లానింగ్ తో… హత్య చేసినట్లు చెబుతున్నారు. ఆర్థిక లావాదేవీల కారణంగానే చందు నాయక్ ను హత్య చేసి ఉంటారని చెబుతున్నారు.
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025