March 17, 2025
SGSTV NEWS
CrimeNational

భార్య తల నరికి.. బ్యాగులో పెట్టుకొని..! ఒళ్లు జలదరించే క్రైమ్‌ స్టోరీ



ముంబైలో ఓ భర్త తన భార్యను కిరాతకంగా హత్య చేసి, శరీర భాగాలను వేరు చేసి పడేశాడు. ఉత్పల అనే మహిళను ఆమె భర్త హిప్పర్గి గొంతు కోసి చంపి, తలను బ్యాగులో పెట్టి దర్గా దగ్గర వదిలేశాడు. పోలీసులు ఆమె తలను గుర్తించి హిప్పర్గిని అరెస్ట్ చేశారు. ఈ దారుణ హత్యకు కారణం వారి కుమారుడితో జరిగిన గొడవ అని పోలీసులు తెలిపారు.


కొన్ని హత్యలు జరిగిన తీరు వింటుంటేనే భయం పుడుతుంది. ఈ మధ్య కాలంలో హత్యలు జరిగే తీరు అత్యంత క్రూరంగా, భయంకరంగా ఉంటున్నాయి. తాజాగా అలాంటిదో మరో హత్య జరిగింది. ఓ వ్యక్తి తన భార్యను అత్యంత కిరాతంగా హత్య చేసి.. తలా మొండెం వేరే చేశాడు. తలను ఓ బ్యాగులో ప్యాక్‌ చేసి ఓ దర్గా దగ్గర పెట్టాడు. ఈ దారుణ ఘటన మహారాష్ట్రంలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ముంబై పరిసరాల్లో వన్‌గ్రామ్‌ గోల్డ్‌ ఆభరణాల తయారీ పరిశ్రమలో పనిచేసే హిప్పర్గి, తన భార్య ఉత్పల(51), వారి 22 ఏళ్ల కుమారుడితో కలిసి నివసించాడు. ఈ జంటకు తరచుగా గొడవలు జరిగేవని, అందుకు కారణం వారి కుమారుడు.


నిజానికి ఉత్పలకు గతంలోనే ఓసారి వివాహం జరిగింది. అప్పుడు జన్మించిన కుమారుడే ఇప్పుడు వీరితో ఉంటున్నాడు. అతని విషయంలో జనవరి 8న మరోసారి గొడవ జరగింది. ఆ సమయంలో విచక్షణ కోల్పోయిన హిప్పర్గి, ఉత్పలను గొంతు కోసి చంపాడు. నేరాన్ని దాచడానికి, ఆమె మృతదేహాన్ని విరార్ ఈస్ట్‌కు తీసుకెళ్లాడు. అక్కడ గొడ్డలితో ఆమె తలను మొండెం వేరు చేశారు. ఆ తర్వాత నిందితుడు మొండెంను కాలువలోకి విసిరేశాడని, తెగిపోయిన తలను ట్రావెల్ బ్యాగ్‌లో ప్యాక్ చేసి పీర్కొండ దర్గా సమీపంలో వదిలేశాడని పోలీసులు తెలిపారు. ఉత్పల పశ్చిమ బెంగాల్‌లోని తన స్వస్థలానికి వెళ్లిందని, ఆమె కుమారుడికి అబద్ధం చెప్పాడు.

అయితే, శుక్రవారం పోలీసు అధికారులు విరార్‌లో ఓ ట్రావెల్ బ్యాగ్‌ను గుర్తించారు. అందులో ఓ పుర్రెను చూసి షాక్‌ అయ్యారు. విచారణ జరపగా.. ఆ బ్యాగ్‌లో ఉంది ఓ మహిళ పుర్రె అని, హత్య జరిగి దాదాపు రెండు నెలలు అయి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. విచారణ చేపట్టగా.. ఆ బ్యాగ్‌ బెంగాల్‌లోని ఓ నగల దుకాణానికి చెందిందని గుర్తించారు. అక్కడి వెళ్లి విచారించగా.. కస్టమర్‌ లిస్ట్‌లో ఉత్పల పేరు ఉంది. ఆ పేరుతో ఒక్క దర్యాప్తు చేపట్టడంతో నేరం బయటపడింది. తదుపరి దర్యాప్తులో భాగంగా ఉత్పల ఫోన్ గత రెండు నెలలుగా స్విచ్ ఆఫ్‌లో ఉందని తేలింది. హిప్పార్గి కూడా అజ్ఞాతంలోకి వెళ్లి పోయాడు. అనేక ఆధారాలను వెతికిన తర్వాత, పోలీసులు అతన్ని నలసోపారాలోని రహమత్ నగర్‌లో గుర్తించి శుక్రవారం రాత్రి అరెస్టు చేశారు. హత్య దర్యాప్తు కొనసాగుతుండగా, అధికారులు ఇప్పుడు ఉత్పల శరీరం కోసం వెతుకుతున్నారు.

Also read

Related posts

Share via