SGSTV NEWS
CrimeNational

ఫ్రెండ్‌ను చంపి, అతని డెడ్‌బాడీపై నిల్చోని డ్యాన్స్‌! హత్యకు కారణం ఏంటంటే..?

మైసూర్ శివార్లలోని వరుణ గ్రామంలోని ఒక హోటల్ ముందు నిన్న రాత్రి ఐదుగురు సభ్యుల ముఠా ఒక యువకుడిని దారుణంగా హత్య చేసింది. హత్యకు గురైన యువకుడిని మైసూరు నగరంలోని క్యాతమారనహళ్లి నివాసి కార్తీక్ (33) గా గుర్తించారు. ఈ హత్యను కొంతమందితో కలిసి మృతుడు కార్తీక్‌ స్నేహితుడు ప్రవీణ్ చేశాడని అనుమానులు ఉన్నాయి. దీనికి కారణం కొన్ని నెలల క్రితం కార్తీక్, ప్రవీణ్ మధ్య గొడవ జరగడమే. ఇద్దరి మధ్య ఆర్థిక విషయాలపై వివాదం నెలకొంది. గొడవ సమయంలో కార్తీక్ ప్రవీణ్‌ను చంపేస్తానని బెదిరించాడని తెలుస్తోంది. కార్తీక్ తనను చంపేస్తాడనే భయంతో ప్రవీణే కార్తీక్‌ను హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

చిక్కహళ్లిలో జరిగిన ఓ హత్యాయత్నం కేసులో కార్తీక్ జైలు పాలై బెయిల్‌పై విడుదలయ్యాడు. కార్తీక్ ఒక రౌడీ షీటర్. అయితే కార్తీక్‌ హత్యలో ఓ మహిళకు కూడా హస్త ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. కార్తీక్ తల్లి ప్రకారం.. ఈ హత్యకు లక్ష్మి అనే మహిళకు సంబంధం ఉందని అన్నారు. ఆమె వల్లే ఈ హత్య జరిగినట్లు తెలుస్తోంది. ఆదివారం రాత్రి ఆమె కార్తీక్‌కి ఫోన్ చేసి భోజనానికి రమ్మని పిలిచింది. ఆ తర్వాత కార్తీక్ ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అక్కడి నుంచి కార్తీక్ నేరుగా హోటల్ కి వెళ్ళాడు. అక్కడ ప్రవీణ్ తన ముఠాతో కలిసి కార్తీక్‌ను హత్య చేశాడని కార్తీక తల్లి వెల్లడించింది.

లక్ష్మి విషయంలో కార్తీక్, ప్రవీణ్ మధ్య గతంలో గొడవ జరిగినట్లు తెలుస్తోంది. అయితే.. కార్తీక్‌ను హత్య చేసిన తర్వాత అతని మృతదేహంపై నిల్చోని డ్యాన్స్‌ చేస్తూ ప్రవీణ్‌ వికృతంగా ప్రవర్తించాడని, వీడియోలు తీసుకున్నాడని స్థానికులు చెబుతున్నారు. హత్య చేసిన తర్వాత మృతదేహంపై డ్యాన్స్‌ చేస్తున్న దృశ్యం సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. సీసీ ఫుటేజ్‌ ఆధారంగా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసుకుని, నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు

Also read

Related posts

Share this