శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గలో తాగిన మైకం లో రుద్రమంతి మణికంఠ అనే మందుబాబు వీరంగం సృష్టించాడు. కాశీబుగ్గలోనీ చౌదరి బార్ అండ్ రెస్టారెంట్ లో తప్పతాగిన మణికంఠ బార్ సిబ్బందితో, బార్‌కు వచ్చిన కస్టమర్లతోనూ గొడవకు దిగాడు. బార్ లోని టేబుల్స్ ధ్వంసం చేసి అడ్డుకున్న సిబ్బందిపై దాడికి దిగాడు మందుబాబు మణికంఠ. బార్ లో ఉన్నవారిని భయబ్రాంతులకు గురిచేసి పరుగులు పెట్టించాడు. చివరకు రంగంలోకి దిగిన కాశీబుగ్గ పోలిసులు స్టేషన్ కి తీసుకువెళ్లి వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేయగా పోలీస్ స్టేషన్ లో కూడా మణికంఠ వీరంగం సృష్టించి రచ్చరoబోలా చేసేశాడు
మద్యం మత్తులో ఉన్న మణికంఠ పోలీస్ స్టేషన్ లోని రిసెప్షన్ రూమ్ అద్దాన్ని పగలగొట్టి భీభత్సం చేశాడు. మణికంఠ చేతికి గ్లాస్ గీసుకుపోయి తీవ్ర గాయం కావడంతో హుటా హుటిన అతనిని చికిత్స కోసం పలాస ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు. కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. అనంతరం మణికంఠ పై పోలిసులు కేసు నమోదు చేశారు. సీసీ కెమెరా పుటేజ్ ను పరిశీలించి దర్యాప్తు చేపడుతున్నారు. అసలే ఎన్నికల వేళ ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణం కల్పించేందుకు పోలిసులు ఓ వైపు విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటే, మందుబాబు మణికంఠ మంగళవారం మద్యం మత్తులో తన విశ్వరూపాన్ని చూపించి స్థానికులను భయాందోళనలకు గురిచేశాడు.
ఇప్పుడే ఇలా ఉంటే ఎన్నికల ప్రచారం ఊపందుకుని ఉచిత మద్యం పాలసీకి రాజకీయ పార్టీలు తెరలేపితే పరిస్థితి ఇంకా ఎలా ఉంటుందో అని తలచుకుని స్థానికులు హడలిపోతున్నారు. ఏది ఏమైనా ఎన్నికలు ముగిసే వరకు పోలిసులు మందుబాబుల ఆగడాలపై ఓ కన్నేసి ఉంచాలని కోరుతున్నారు.
Also read
- నేటి జాతకములు 22 నవంబర్, 2024
- తెలంగాణ : అయ్యో..పాపం..వీళ్లు బంధువాలా.. రాబందువులా?.. ఆస్తిని కాజేసి చివరికి..
- ఈ ఆంజనేయ స్వామి కొండ ఎక్కితే.. పచ్చగా మారుతున్న భక్తులు
- చెల్లి ఫొటోతో ఎఫ్బీ అకౌంట్..యువకుడి నుంచి కోట్లువసూలు, ట్విస్ట్ సూపర్
- అమ్మాయితో మాట్లాడాడని ఇంటర్ విద్యార్థిపై దాష్టీకం కోనసీమలో నలుగురు యువకుల దౌర్జన్యం