దిల్లీలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిని దుండగులు హత్య చేసిన ఘటన బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.
దిల్లీ: తెల్లవారితే తమ తల్లిదండ్రుల వివాహ వార్షికోత్సవం ఉందని వారి కుమారుడు, కుమార్తె అన్ని ఏర్పాట్లు చేశారు. కాని తెల్లారేసరికి వారి ఆనందం ఆవిరైపోయింది. తాను బయటకు వెళ్లొచ్చేలోపు గుర్తుతెలియని వ్యక్తుల దాడిలో తల్లిదండ్రులు, సోదరి ప్రాణాలు కోల్పోవడంతో ఆ యువకుడు కన్నీరుమున్నీరుగా విలపించాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఢిల్లీలోని నెబ్సరాయి ప్రాంతంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిని దుండగులు కత్తితో దారుణంగా పొడిచి హత్య చేశారు. స్థానిక నెబ్సరాయి ప్రాంతంలో దంపతులు తమ కుమారుడు, కుమార్తెతో కలిసి నివసిస్తున్నారు.
బుధవారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తులు వారి ఇంట్లోకి చొరబడి దంపతులు రాజేష్(55), కోమల్(47), వారి కుమార్తె కవిత(23)లపై కత్తితో విచక్షణా రహితంగా దాడి చేసి హత్య చేశారు.
ఆ సమయంలో వాకింగ్ వెళ్లిన కుమారుడు ఉదయం గంటల సమయంలో ఇంటికి వచ్చేసరికి ముగ్గురు రక్తపు మడుగులో పడి ఉండడం చూసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన తండ్రి రాజేష్ ఆర్మీలో పని చేసి రిటైర్ అయ్యాడని తెలిపాడు. డిసెంబర్ 4(నేడు) తమ తల్లిదండ్రుల వివాహ వార్షికోత్సవం ఉందని.. వారితో కలిసి సంతోషంగా జరుపుకుందామనుకునేలోపు ఈ దారుణం చోటుచేసుకుందని కుమారుడు కన్నీరుమున్నీరయ్యాడు. కాగా, దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నామని.. దర్యాప్తు కొనసాగుతోందని పేర్కొన్నారు.
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025