SGSTV NEWS
CrimeTelangana

జగిత్యాల గురుకుల స్కూల్లో కలుషిత ఆహారం…30 మంది స్పాట్‌లోనే…


జగిత్యాల జిల్లాలోని లక్ష్మీపూర్ మండలంలో ఉన్న గురుకుల స్కూల్లో మధ్యాహ్న భోజనం వికటించింది. దీంతో ఆ ఆహారం తిన్న 30 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. భోజనం అనంతరం వాంతులు, కడుపునొప్పితో విలవిలలాడగా…వారిని ఆసుపత్రికి తరలించారు.

Gurukula school  : ప్రభుత్వం ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నా గురుకుల పాఠశాలల్లో తీరు మారటం లేదు. కలుషిత ఆహారంతో విద్యార్థులు తరుచుగా అస్వస్థతకు గురువుతున్నప్పటికీ అధికారులు మాత్రం తమ నిర్లక్ష్యాన్ని వీడడం లేదు. తాజాగా జగిత్యాల జిల్లాలోని లక్ష్మీపూర్ మండలంలో ఉన్న గురుకుల స్కూల్లో మధ్యాహ్న భోజనం వికటించింది. దీంతో ఆ ఆహారం తిన్న 30 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. భోజనం అనంతరం వాంతులు, కడుపునొప్పితో విలవిలలాడగా… పాఠశాల సిబ్బంది వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనలో పలువురు విద్యార్థినీల పరిస్థితి విషమంగా ఉందని తేలింది. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే విద్యార్థినీల జీవితాలు గాలిలో దీపాలవుతున్నాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇప్పటికే ఇలాంటి ఘటనలు అనేకం జరిగినా ప్రభుత్వం నిర్లక్ష్యం వీడటం లేదన్న విమర్శలు వినవస్తున్నాయి.

Also read

Related posts

Share this