ములుగు : ములుగు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. అన్నదమ్ములు నీటికుంటలో జారిపడి మృతిచెందారు. స్థానికుల కథనం ప్రకారం.. మంగపేట మండలం కమలాపూర్‌కు చెందిన మాలోతు యాకూబ్-స్వాతి దంపతులకు ఇంటర్, పదోతరగతి చదివే వినయ్ కిశోర్ (16), రాజేశ్ (14) కుమారులున్నారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా స్వాతి తన ఇద్దరు కుమారులను తీసుకుని.. ములుగు మున్సిపాలిటీ పరిధి గణేశాల్పల్లిలోని పుట్టింటికి వెళ్లారు. ఆదివారం సెలవు కావడంతో పిల్లలిద్దరినీ అక్కడే ఉంచి.. ఆమె తిరిగి కమలాపూర్ వెళ్లారు.
ఆదివారం సాయంత్రం బంధువుల అబ్బాయితో కలిసి ఆ ఇద్దరు బాలురు గ్రామ సమీపంలోని మొండికుంటకు బహిర్భూమికి వెళ్లారు. ఈ క్రమంలో కుంటలో మొరం మట్టి కోసం తీసిన గుంతలో అన్నదమ్ములు జారిపడి మునిగిపోయారు. గమనించిన మరో బాలుడు గ్రామస్థులకు చెప్పాడు. వారు వెంటనే అక్కడికి చేరుకుని గాలించగా అప్పటికే వారు మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. వ్యవసాయ కూలీ పనులు చేసుకునే యాకూబ్ దంపతులు.. కన్నబిడ్డలు మృతిచెందడంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
Also read
- ఛీ.. ఛీ మరీ ఇంతకు దిగజారాలా? లోన్ కట్టలేదని.. బాధితురాలి 10వ తరగతి కూతురి ఫోటోలతో..
- నేటి జాతకములు 10 సెప్టెంబర్, 2026
- Hyderabad: ఇంట్లో గడియ పెట్టుకుని బయటకు రాని లేడీ డాక్టర్.. తొంగి చూసి అంతా షాక్!
- కాళ్ల పారాణి ఆరకముందే తీరని విషాదం.. పాపం పెళ్లైన 6 రోజులకే వరుడు..
- పగలు భక్తులు.. రాత్రయితే దొంగలు.. దేవుడి సొమ్ము ఎలా దోచుకుంటున్నారో తెలుసా..?





