SGSTV NEWS
Andhra PradeshCrime

బావతో సహజీవనం చేస్తోందంటూ..

👉 మహిళపై కొడవలితో దాడి చేసిన బావమరిది

👉తీవ్రగాయాలతో హాస్పిటల్లో చికిత్స



నెల్లూరు సిటీ: మహిళపై కొడవలితో దాడి చేసిన ఘటన నెల్లూరు  రూరల్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. తోటపల్లిగూడూరు మండలానికి చెందిన శేషమ్మ అనే మహిళను 20 ఏళ్ల క్రితం భర్త వదిలేశాడు. ప్రస్తుతం ధనలక్ష్మీపురంలో నివాసం ఉంటూ క్రేజీకే కల్యాణ మండపం వద్ద పండ్ల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తోంది. తోటపల్లిగూడూరు మండలానికి చెందిన కరుణాకరన్తో ఆమె సహజీవనం చేస్తోంది.

అతను ఇంటికి వెళ్లకుండా ఎక్కువ సమయం శేషమ్మ వద్ద ఉండటం అతడి బావమరిది శ్రీనివాసులుకు తెలిసింది. తన సోదరికి అన్యాయం జరుగుతోందని అతను శేషమ్మపై కోపం పెంచుకున్నాడు. శుక్రవారం పండ్ల దుకాణం వద్ద శ్రీనివాసులు కొడవలితో శేషమ్మ మెడపై దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన ఆమెను స్థానికులు హాస్పిటల్ కు తరలించారు. సమాచారం అందుకున్న రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also read

Related posts

Share this