YSRCP: గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలో ఉద్రిక్తత కొనసాగుతుంది. సహనం కోల్పోయిన స్థానిక ఎమ్మెల్యే శివ కుమార్ కు, ఓటర్ కు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. కోపంతో ఓటర్ పై ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ చేయి చేసుకున్నాడు.. ఆ వెంటనే ఎమ్మెల్యే శివ కుమార్ చంపపై తిరిగి ఓటర్ దాడి చేశాడు. దీంతో కోపంతో ఊగిపోయిన ఎమ్మెల్యే శివ కుమార్ అనుచరులు ఓటరుపై దాడికి దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.
కాగా, ఓటరుపై ఎమ్మెల్యే శివ కుమార్ దాడి చేసిన ఘటనపై ఎలక్షన్ కమిషన్, పోలీసులు స్పందించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు సేకరించి తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఇక, ఈ దాడిపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అయితే, ఇరువురు శాంతియుతంగా ఉండాలంటూ ఈసీ పేర్కొనింది. దీంతో పోలింగ్ కేంద్రం వద్ద భారీగా పోలీసులు మోహరించి ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా తగిన ఏర్పాట్లు చేశారు.
Also read
- ఆ ఆలయంలో పూజ చేస్తే అపమృత్యు దోషం దూరం! ఎక్కడుందంటే?
- నేటి జాతకములు….25 అక్టోబర్, 2025
- Telangana: 45 ఏళ్ల మహిళతో పరాయి వ్యక్తి గుట్టుగా యవ్వారం.. సీన్లోకి కొడుకుల ఎంట్రీ.. కట్ చేస్తే
- ఉపాధి కోసం కువైట్ వెళ్తానన్న భార్య.. వద్దన్న భర్త ఏం చేశాడో తెలుసా?
- Telangana: వారికి జీతాలు ఇచ్చి ఆ పాడు పని చేపిస్తున్నారు.. పొలీసులే నివ్వెరపోయిన కేసు ఇది..




