February 24, 2025
SGSTV NEWS
Andhra PradeshCrime

Chittor: మా ఆయన శవం నాకు కావాలి.. కొట్టుకున్న ఇద్దరు భార్యలు


భర్త మృత దేహం కోసం ఇద్దరు భార్యలు కొట్టుకునే ఘటన చిత్తూరులో జరిగింది. చిత్తూరుకి చెందిన డీఈ సుబ్రహ్మణ్యానికి ఇద్దరు భార్యలు ఉన్నారు. అనారోగ్య సమస్యలు వచ్చి సుబ్రహ్మణ్యం మృతి చెందాడు. దీంతో మొదటి భార్య, రెండో భార్య తమకు మృతదేహం కావాలని గొడవ పడ్డారు

ఈ రోజుల్లో కొందరు కొడుకులు కన్న తండ్రి మృత దేహం దగ్గర కూడా గొడవలు పడుతున్నారు. నాకు వద్దంటే వద్దని కొందరు శవాన్ని నడిరోడ్డు మీద వదిలేస్తున్నారు. రోజురోజుకీ ఈ సమాజంలో మానవత్వం చచ్చిపోతుంది. అయితే చిత్తూరులో భర్త మృతదేహం కోసం ఇద్దరు భార్యలు గొడవపడిన ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. నారాయణవనం మండలంలోని చిత్తూరు కండ్రిగలో విశ్రాంత ట్రాన్స్‌కో డీఈ సుబ్రహ్మణ్యం ఉంటున్నాడు

చికిత్స పొందుతూ ఆసుపత్రిలోనే..
ఇతను గత మూడేళ్ల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నాడు. అయితే ఇతనికి ఇద్దరూ భార్యలు ఉన్నారు. మొదటి భార్య తిరుపతిలో ఉండగా.. రెండవ భార్య చిత్తూరులో ఉంటుంది. ఇటీవల సుబ్రహ్మణ్యం పరిస్థితి విషమించడంతో రెండు భార్య, కుమారుడు అతన్ని స్విమ్స్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సుబ్రహ్మణ్యం అక్కడే మృతి చెందాడు

ఈ విషయం తెలుసుకున్న మొదటి భార్య, కొడుకు అక్కడికి చేరుకుని, మృత దేహాన్ని తనకి అప్పగించాలని కోరారు. రెండో భార్య మృతదేహాన్ని తనకే అప్పగించాలని కోరింది. ఇద్దరు భార్యలు అక్కడ గొడవ పడ్డారు. కాస్త అయితే కొట్టుకునే వరకు వెళ్లేవారు. ఇంతలో పోలీసుల వచ్చిన వారికి సర్ది చెప్పారు. ఇద్దరు చర్చించుకున్న తర్వాత వస్తే మృతదేహాన్ని అప్పగిస్తామని పోలీసులు వెల్లడించారు. సొంత తల్లిదండ్రుల మృతదేహాలను డబ్బుల కోసం రోడ్డు మీద వదిలేస్తున్నారు. కానీ భర్త మృతదేహం కోసం ఇద్దరు భార్యలు ఇలా గొడవ పడటంతో కొందరు వారిని అభినందిస్తున్నారు.

Also read



Related posts

Share via