పలమనేరులో జిమ్‌లో వ్యాయామం అనంతరం 27 ఏళ్ల బ్యాంక్ ఉద్యోగి విశ్వనాథ్ అస్వస్థతకు గురై ఆస్పత్రికి తరలించేలోగానే మృ*తి చెందాడు. అధిక వ్యాయామం వల్ల గుండెపోటు వచ్చి ఉండవచ్చని వైద్యులు భావిస్తున్నారు. ఓవర్‌గా జిమ్ చేయడం ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Chittoor: చిత్తూరు జిల్లా పలమనేరులో విషాద ఘటన జరిగింది. జిమ్‌లో వ్యాయామం చేస్తున్న సమయంలో ఓ యువ బ్యాంక్ ఉద్యోగి అకస్మాత్తుగా అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోయాడు.
విశ్వనాథ్ (27) వి.కోటలో ఉన్న డీసీసీబీ బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. ప్రతిరోజులాగే ఉదయం జిమ్‌కు వెళ్లి వ్యాయామం చేశారు. వ్యాయామం ముగిసిన కొద్దిసేపటికే ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే అక్కడున్న వారు ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే మార్గమధ్యంలోనే ఆయన మరణించినట్లు వైద్యులు తెలిపారు.
పలమనేరులోని వీరరాఘవయ్య వీధిలో నివసిస్తున్న విశ్వనాథ్‌కు భార్య, ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. ఈ సంఘటన కుటుంబాన్ని తీవ్ర దుఃఖంలో ముంచింది.
వైద్యుల ప్రాథమిక అంచనా ప్రకారం, అధికంగా వ్యాయామం చేయడం వల్ల గుండెపోటు వచ్చి ఉండవచ్చని భావిస్తున్నారు. గతంలో ఆయనకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఇలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండానే ఒక్కసారిగా గుండెపోటు రావడం ఆశ్చర్యకరమని వైద్యులు పేర్కొన్నారు.
ఇటీవల వేగంగా బరువు తగ్గాలని, త్వరగా బాడీబిల్డింగ్ చేయాలని కొందరు అధికంగా వ్యాయామం చేస్తున్నారు. సరైన విశ్రాంతి లేకుండా, తగినంత ద్రవాలు తీసుకోకుండా ఓవర్‌గా జిమ్ చేయడం ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఆరోగ్యం కోసం వ్యాయామం అవసరం కానీ, పరిమితి దాటితే ప్రాణాపాయం కలగవచ్చని సూచిస్తున్నారు.
Also read
- అప్పుల బాధ తాళలేక.. గోదావరిలోకి దూకిన కుటుంబం
- సోషల్ మీడియా లో పరిచయం.. మాయమాటలతో వల
- చున్నీతో చేతులు కట్టేసి.. నోట్లో రుమాలు కుక్కి..
- బచ్చలకూర అనుకుని పప్పులో గన్నేరాకు వేసి
- ‘సారీ రాధికా.. గుడ్‌బై’.. భార్య పుట్టినరోజు నాడే హైదరాబాద్ టెకీ ఆత్మహత్య





