June 29, 2024
SGSTV NEWS
Andhra PradeshCrime

Chirala: కర్రీ పాయింట్ నడిపే యువకుడి దారుణ హత్య

బాపట్ల జిల్లా చీరాలలో దారుణం చోటుచేసుకుంది. కర్రీ పాయింట్ నడిపే యువకుడు కంచర్ల సంతోష్ (33) హత్యకు గురయ్యాడు.

చీరాల: బాపట్ల జిల్లా చీరాలలో దారుణం చోటుచేసుకుంది. కర్రీ పాయింట్ నడిపే యువకుడు కంచర్ల సంతోష్ (33) హత్యకు గురయ్యాడు. చిన్నా అనే వ్యక్తి అతడిని కత్తితో పొడిచి చంపాడు. పట్టణంలోని సంగం థియేటర్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
Also read :లగ్జరీ లైఫ్ గడిపిన పవిత్ర గౌడ్.. ఇప్పుడు జైల్లో నిద్ర పట్టక!
వివరాల్లోకి వెళితే.. సంతోష్ కర్రీ పాయింట్ నిర్వహిస్తుండగా, చిన్నా అరటి పండ్లు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు. ఆదివారం ఉదయం అరటిపండ్ల దుకాణం ఎదుట రోడ్డుపై నీటిని చిన్నా పారబోశాడు. ఆ నీళ్లు కర్రీ పాయింట్ వరకు వెళ్లాయి. దీంతో సంతోష్, చిన్నా మధ్య మాటామాటా పెరిగి ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో చిన్నా కత్తితో సంతోష్ను పొడిచాడు. గమనించిన స్థానికులు క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు.

Also read :దొంగతనానికి వెళ్లి.. ఇంటి యజమానులనే ఎవరు మీరని అడిగిన దొంగ!

Related posts

Share via