July 3, 2024
SGSTV NEWS
Andhra PradeshPolitical

తన రాజకీయ శత్రువుని కూడా అభిమానంగా ఆదరించే గొప్ప వ్యక్తిత్వం ఉన్న నాయకుడు చింతమనేని ప్రభాకర్

*దెందులూరు/27.03.2024/ పత్రికా ప్రకటన*

*”తన రాజకీయ శత్రువుని కూడా అభిమానంగా ఆదరించే గొప్ప వ్యక్తిత్వం ఉన్న నాయకుడు చింతమనేని ప్రభాకర్ – దెందులూరులో వైసిపికి జెండా మోయటానికి కూడా ఎవరూ లేని సమయంలో ఆ పార్టీని ఆదుకున్నాం – అందుకు ప్రతిఫలంగా ఎన్నో అవమానాలు పడ్డాం –  దెందులూరులో అభివృద్ధి జరిగింది అంటే అది చింతమనేని వల్లే – అందుకే వైసిపి కి వీడ్కోలు పలికి దెందులూరు NDA కూటమి అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ నాయకత్వంలో టిడిపిలో చేరుతున్నాము – దెందులూరులో భారీ మెజారిటీతో చింతమనేని విజయం ఖాయం ” : దెందులూరులో సీనియర్ వైసిపి నాయకుల కీలక వ్యాఖ్యలు*

– *బుధవారం ఉదయం దెందులూరులో జరిగిన జయహో  బిసి కార్యక్రమం సందర్భంగా దెందులూరు సీనియర్ వైసిపి నాయకులు,  కొప్పుల వెలమ సంఘం రాష్ట్ర నాయకులు సంపంగి వేణుగోపాల తిలక్, వైఎస్ఆర్సిపి దెందులూరు మండలం బీసీ సెల్ మాజీ అధ్యక్షుడు కొలుసు నాని, అలుగులగూడెం గ్రామానికి చెందిన వైసిపి  నేత దాసే శీను ఆధ్వర్యంలో దెందులూరు మండలంలోని పలు గ్రామాలకు చెందిన సుమారు 100 కుటుంబాలు వైసిపిని వీడి టిడిపిలో చేరిక. పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించిన చింతమనేని ప్రభాకర్.*

*దెందులూరు నియోజక వర్గ NDA కూటమి అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ కామెంట్స్:*

*ప్రజలకోసం నిస్వార్ధంగా పోరాడే వ్యక్తులు రాజకీయంగా ఏ పార్టీలో ఉన్నా కూడా వారికి గౌరవము ఉంటుంది. దెందులూరులో జరుగుతున్న వైసిపి అవినీతి పాలనకు స్వస్తి చెప్పి సీనియర్ నాయకులు తిలక్ అధ్వర్యంలో టిడిపిలో జాయిన్ అయిన ప్రతి ఒక్కరినీ కూడా మా కుటుంబ సభ్యులుగానే చూస్తాం. రాబోయే ఎన్నికల్లో ఈ వైసిపి దుర్మార్గ పాలనను, వారి కుట్రలను తిప్పి కొట్టడానికి, దెందులూరు మండలంలోని పలు గ్రామాల అభివృద్దే లక్ష్యంగా ముందుకు వచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియచేస్తు, మీ అందరికీ ప్రజల్లో మరింత గౌరవం దక్కేలా ప్రజాస్వామ్య రీతిలో అవినీతి, అక్రమాలు లేని సుపరిపాలన అందిస్తామని చింతమనేని ప్రభాకర్ తెలిపారు. ఈరోజు వైసిపి నీ వీడి టిడిపిలోకి వచ్చిన వారు రాజకీయ స్వలాభం కోసం రాలేదని, గతంలో వారి స్వార్థం కోసమే వచ్చి పార్టీలో చేరి లబ్ది పొందిన తర్వాత పార్టీని వదిలి వెళ్లిన వాళ్లను చరిత్ర మర్చిపోదని చింతమనేని ప్రభాకర్ తెలిపారు. ఎస్సీ సొసైటీ లో సభ్యత్వం రాని వారి సమస్యను పరిష్కరించేలా సంబంధిత ఉన్నతాధికారులతో మాట్లాడి NDA కూటమి అధికారంలోకి వచ్చిన 6నెలలలోపే సభ్యత్వం ఇప్పించి, మీ అందరి సమక్షంలో గుర్తింపు కార్డులు అందజేస్తామని చింతమనేని ప్రభాకర్ తెలిపారు.
సొసైటీ చెరువును రిజర్వాయర్ చేయాలని తాను గతంలో ప్రయత్నించాను అని, కృష్ణా గోదావరి కాల్వలు నుంచి ఏదైనా ఇబ్బంది వల్ల నీరు రాకపోయినా, చెరువులో మాత్రం నీటి ఎద్దడి లేకుండా తన హయాంలో చర్యలు చేపట్టామని, వైసిపి హయాంలో చెరువుల అభివృద్ధిని పట్టించుకునే వారే లేరని చింతమనేని ప్రభాకర్ తెలిపారు. మరోవైపు రైతుల బాధలు వర్ణనాతీతం అని అన్నారు. గత తుఫాన్ సమయంలో రంగు మారి, తడిచి మొలకెత్తిన ధ్యానంతో నష్టపోయిన రైతులకు ఈ నాటికీ అతి గతి లేదనీ అన్నారు.
ఇలాంటి ప్రభుత్వన్ని ఇకపై ప్రజలు చూడబోరు అని అన్నారు. వచ్చే ఎన్నికల్లో NDA కూటమి విజయం కోసం ప్రతి నాయకులు కార్యకర్త స్వచందంగా పని చెయ్యాలనీ , బాబు సూపర్ సిక్స్ పథకాలను ప్రజలు కు మరింత చేరువ చెయ్యాలనీ చింతమనేని ప్రభాకర్ పార్టీ శ్రేణులకు సూచించారు..


ఈ కార్యక్రమంలో దెందులూరు మండల పార్టీ అధ్యక్షులు మాగంటి నారాయణ ప్రసాద్ (మిల్లు బాబు), దెందులూరు గ్రామ సర్పంచ్ తోట ఏసమ్మ,
ఏలూరు జిల్లా బిసి సెల్ ప్రధాన కార్యదర్శి ఇప్పిలి వెంకటేశ్వర రావు (YVR), పెదవేగి,ఏలూరు రూరల్ మండల పార్టీల అధ్యక్షులు బొప్పన సుధా, నంబూరి నాగరాజు, సీనియర్ నాయకులు తాతా సత్యనారాయణ, దెందులూరు క్లస్టర్ ఇంచార్జీ గారపాటి కొండయ్య చౌదరి, సీతంపేట క్లస్టర్ ఇంచార్జీ పరసా వెంకట రావు, పోతునురు క్లస్టర్ ఇంచార్జీ బొడ్డేటి మోహన్ బాబు, దెందులూరు గ్రామ ఉపసర్పంచ్ వేమూరి మురళి కృష్ణ, నియోజక వర్గ తెలుగు యువత అధ్యక్షులు మోతుకురి నాని, మండల తెలుగు యువత అధ్యక్షులు ఏనుగు రామకృష్ణ, TNSF అధ్యక్షులు పెనుబోయిన మహేష్ యాదవ్, MPTC పెనుబోయిన సేషారత్నం, సీనియర్ నాయకులు పర్వతనేని రంగారావు, లీగల్ సెల్ కార్యదర్శి కొల్లిపర భాస్కర రావు, కలపాల బుజ్జి (సత్యనారాయణ పురం బుజ్జి), వీరమాచనేని ప్రభాకర్, మైనేని శేషు బాబు, డాక్టర్ పసుమర్తి మధు, మాజీ సర్పంచ్ నూతలపాటీ అజయ్, షేక్ జహీర్ అహ్మద్ సహా పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు..
*************
ఇట్లు
మీడియా కొర్డినేషన్ విభాగం,
చింతమనేని ప్రభాకర్ వారి కార్యాలయం,
దుగ్గిరాల.

Also read

Related posts

Share via