చిన్నారుల అశ్లీల వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్, సెర్స్ చేస్తున్న వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ 2 నెలల్లో 71 కేసులు నమోదు చేసి 47 మందిని అరెస్టు చేసినట్లు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ తెలిపారు. ఫిర్యాదుకోసం 1930.
Blue film case: దేశవ్యాప్తంగా లైంగిక దాడులు పెరిగిపోతుండటంతో ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. ముఖ్యంగా పోర్న్ సైట్లపై పోలీసులు ప్రత్యేక నిఘా పెడుతున్నారు. చిన్నపిల్లలకు సంబంధించిన నీలి చిత్రాల విషయంలో మరింత యాక్టివ్‌గా ఉంటూ ఎప్పటికప్పుడూ యాక్షన్ తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే బాలికల అశ్లీల వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం, సెర్స్ చేస్తున్న ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ మేరకు గడిచిన 2 నెలల్లో 71 కేసులు నమోదు చేసి 47 మంది నిందితులను అరెస్టు చేసినట్లు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ తెలిపారు
సైబర్ గస్తీ..
ఈ మేరకు శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించిన ఆయన.. జనవరి, ఫిబ్రవరి నెలల్లో 71 కేసులు నమోదవగా 47మందిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు. సోషల్ మీడియాలో చిన్న పిల్లల శృంగార ఫొటో, వీడియో కార్యకలాపాలను గమనించేందుకు తమ బ్యూరోలో చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ (CPU)ను ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నేషనల్ సైబర్ క్రైం రిపోర్టింగ్ పోర్టల్ (CPRP) నుంచి వచ్చే కంప్లైట్స్ తోపాటు CPU ద్వారా సైబర్ గస్తీ నిర్వహిస్తామన్నారు. పక్కా ఆధారాలు సేకరించి నేరం రుజువైతే కేసులు నమోదు చేసి జైల్లో వేస్తామన్నారు.
ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న ఇండియన్ చైల్డ్ ప్రొటెక్షన్ (ICP)తో కలిసి పనిచేసేలా CPUను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించినట్లు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ తెలిపారు. చిన్నారుల అశ్లీల దృశ్యాలు తమ కంటపడితే 1930కి ఫిర్యాదు చేయాలని సూచించారు.
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025