కలుషితాహారం తిని 42 మంది బీటెక్ విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటన చెన్నైలోని ఈరోడ్‌లో చోటుచేసుకుంది.
ఈరోడ్: తమిళనాడులోని చెన్నైలో ఓ ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన 42 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. కలుషితాహారం తిని అస్వస్థతకు గురి కావడంతో ఆదివారం ఉదయం ఆస్పత్రిలో చేరినట్లు పోలీసులు వెల్లడించారు. శనివారం రాత్రి భోజనం చేసిన విద్యార్థులు అసౌకర్యానికి గురై.. వాంతులు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. దీంతో పుడ్పెయిజనింగ్ అయినట్లు భావిస్తున్నట్లు పేర్కొన్నారు. వారందరినీ ఈరోడ్ జిల్లా వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించి చికిత్స అందించినట్లు తెలిపారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వెల్లడించారు.
Also read
- Telangana: ఆ తండ్రి బాధ చూస్తే కన్నీళ్లు ఆగవు.. త్వరలోనే కూతురి పెళ్లి.. ఇంతలోనే
- భర్త మరణంతో కుంగిపోయి చివరకు.. తల్లి, ఆరేళ్ల కుమారుడు మృతి!
- కాల్‌మనీ వేధింపులకు ఔట్సోర్సింగ్ ఉద్యోగి బలి
- అర్ధరాత్రి ప్రమాదం.. సాఫ్ట్వేర్ ఇంజినీర్ మృతి
- గురుకులంలో విద్యార్థిని ప్రసవం





