February 3, 2025
SGSTV NEWS
CrimeNational

బాలిక ప్రాణం తీసిన సెంట్రింగ్ కట్టె

దొడ్డబళ్లాపురం: నిర్మాణదారుల నిర్లక్ష్యం తల్లిదండ్రుల కంటి దీపాన్ని బలిగొంది. పాఠశాల నుండి ఇంటికి తిరిగి వెళ్తున్న బాలిక తలపై సెంట్రింగ్కు వాడిన వెదురు కట్టె పడి చనిపోయిన బెంగళూరు వీవీ పురం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బాలిక తేజస్విని (15) రోజు మాదిరిగానే శనివారం సాయంత్రం ఇంటికి తిగిరి వెళ్తుండగా రోడ్డుపక్కన కొత్తగా నిర్మిస్తున్న కట్టడంపై నుండి సెంట్రింగ్ కట్టె తలమీద పడడంతో తీవ్రంగా గాయపడింది.

ఆస్పత్రిలో చేర్పించగా సోమవారం మరణించింది. బాలిక తండ్రి సుధాకర్ రావ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వీవీ పురం పోలీసులు భవన ఇంజినీర్ను అరెస్టు చేసారు. కట్టడం యజమాని, అనుమతులు ఇచ్చిన బీబీఎంపీ అధికారులు, కాంట్రాక్టర్లపై కూడా కేసు నమోదు చేశారు.

Also Read

Related posts

Share via