July 1, 2024
SGSTV NEWS
Andhra PradeshCrimePolitical

సీఎం వైఎస్ జగన్‌తో నిందితుడు ఉన్నా సీబీఐ పట్టించుకోదేం..?

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయదులు, న్యాయమూర్తులను సోషల్ మీడియాలో దూషించిన కేసులో రెండవ నిందితుడు మణి అన్నపురెడ్డిపై ప్రముఖ న్యాయవాది వీవీ లక్ష్మీనారాయణ ఫిర్యాదు చేశారు. మణి అన్నపురెడ్డి మారు వేషంలో ఇండియాలో తిరుగుతున్నా సీబీఐ పట్టించుకోవడం లేదంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. మరికాసేపట్లో హైకోర్ట్ రిజిస్ట్రార్ జనరల్‌కు ఈ ఫిర్యాదును న్యాయవాది అందించనున్నారు.

అమరావతి, ఏప్రిల్ 16: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సుప్రీంకోర్టు న్యాయదులు, న్యాయమూర్తులను సోషల్ మీడియాలో దూషించిన కేసులో రెండవ నిందితుడు మణి అన్నపురెడ్డిపై ప్రముఖ న్యాయవాది వీవీ లక్ష్మీనారాయణ  ఫిర్యాదు చేశారు. మణి అన్నపురెడ్డి మారు వేషంలో ఇండియాలో తిరుగుతున్నా సీబీఐ పట్టించుకోవడం లేదంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. మరికాసేపట్లో హైకోర్ట్ రిజిస్ట్రార్ జనరల్‌కు ఈ ఫిర్యాదును న్యాయవాది అందించనున్నారు. కాగా.. గతంలో జడ్జిలను దూషించిన వ్యవహారంలో లక్ష్మీనారాయణ హైకోర్టుకు ఫిర్యాదు చేయగా.. కేసును సుమోటోగా స్వీకరించింది. ఈ క్రమంలోనే మణి అన్నపురెడ్డి విదేశాల్లో ఉన్నారని సీబీఐ గతంలో హైకోర్టుకు తెలియజేసింది.

అతనికి నోటీసులు జారీ చేసి ఇంటర్‌పోల్ సహాయం కూడా తీసుకుంటున్నామని పేర్కొంది. కానీ మణి అన్నపురెడ్డి పేరు మార్చుకుని ఇండియాకు వచ్చి వైసీపీ ప్రచారంలో పాల్గొంటున్న విషయాన్ని లక్ష్మీనారాయణ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. 15 రోజుల క్రితం మణి అన్నపురెడ్డి ఇండియాకు వచ్చి సిద్ధం సభల్లో పాల్గొన్నారని.. అలాగే మేమంతా సిద్ధం బస్సు యాత్రలో కూడా పాల్గొన్నారని తెలిపారు. అంతే కాకుండా వేదికపై ఫోటోలు దిగడాన్ని న్యాయవాది గుర్తించారు. ఈ క్రమంలో పత్రికల్లో వచ్చిన క్లిప్పింగ్‌లను ఫిర్యాదుకు జత చేశారు. వైసీపీ అధినేత జగన్, వైసీపీ నెల్లూరు లోక్‌సభ అభ్యర్థి విజయసాయి రెడ్డితో దిగిన ఫోటోలను కూడా యాడ్ చేశారు. వెంటనే మణిని అరెస్ట్ చేయాల్సిందిగా సీబీఐకు ఆదేశాలు ఇవ్వాలని లక్ష్మీనారాయణ కోరారు. ఈ మేరకు కోర్టు ప్రారంభమైన వెంటనే ఫిర్యాదును రిజిస్ట్రార్‌కు ఇస్తామని న్యాయవాది వీవీ లక్ష్మీనారాయణ వెల్లడించారు.

ఇదెలా సాధ్యం..

అయితే.. సామాన్యంగా ఇంటర్‌పోల్‌ పరిధిలో ఉన్న వ్యక్తులు విదేశాల నుంచి స్వదేశానికి రావడం సాధ్యమైన విషయం కాదు. కానీ మణి అన్నపురెడ్డి మాత్రం దర్జాగా ఇండియాకు రావడమే కాకుండా.. ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం కూడా షాకింగ్ విషయమే. ప్రచారంలో తిరుగుతున్న మణి అన్నపురెడ్డి… సీబీఐ అధికారులకు ఎందుకు కనిపించడం లేదు అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. అయితే పేరు మార్చుకోవడంతో పాటు పాస్‌పోర్టును కూడా వేరేది సృష్టించి ఇండియాకు వచ్చాడు అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే వేషం కూడా మార్చుకుని అంటే గతంలో ఉన్న గడ్డం తీసేసి గుండుతో ఆయన ఇండియాకు వచ్చినట్లు తెలుస్తోంది. న్యాయమూర్తులను దూషించిన కేసులో 2020 నవంబర్‌లో మణి అన్నపూర్ణ రెడ్డి సహా 17 మందిపై కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. వీరిలో చాలా మందినే పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే మణి అన్నపూర్ణ రెడ్డి అమెరికాలో ఉండటంతో ఆయనను అరెస్ట్ చేసేందుకు ఇంటర్‌పోల్ సహాయం తీసుకున్నామని.. ఎంఎల్‌ఏటీ జారీ చేశామని సీబీఐ చెప్పింది.

ఫేస్‌బుక్‌లో పోస్టులు…

సీన్ కట్‌ చేస్తే.. ఈనెల 6న నెల్లూరు జిల్లా కావాలిలో జరిగిన ‘‘మేమంతా సిద్ధం’’ సభలో ప్రత్యక్షమయ్యారు మణి అన్నపూర్ణ రెడ్డి. పేరు మార్చుకుని ఇండియాకు వచ్చిన ఆయన దర్జాగా సీఎం సభలో పాల్గొనడంతో పాటు డయాస్ పాస్‌ పట్టుకుని ర్యాంప్‌పై తిరిగారు కూడా. ముఖ్యమంత్రి జగన్‌తో పాటు నెల్లూరు లోక్‌సభ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి విజయసాయిరెడ్డితో కలిసి ఫోటోలు దిగారు. అంతటితో ఆగడకుండా ఆ ఫోటోలను మేమంతా సిద్ధం అంటూ తన ఫేస్‌బుక్‌ ఖాతాలో పెట్టారు. అయితే ఫేస్‌బుక్‌లో ఫోటోలను చూసిన పలువురు మణి అన్నపురెడ్డిని గుర్తిస్తూ.. రూపం మార్చుకుని తిరుగుతున్నారంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో మణి అన్నపురెడ్డి వెంటనే అరెస్ట్ చేయాలని న్యాయవాది డిమాండ్ చేస్తున్నారు

Also read

Related posts

Share via