మహిళ హత్య కేసులో కింది కోర్టు విధించిన యావజ్జీవ శిక్షను హైకోర్టు రద్దు చేయగా.. సదరు ఖైదీ 2020లో తాత్కాలికంగా పెరోల్పై బయటికి వెళ్లి మళ్లీ జైలుకు రాలేదని వెల్లడైంది.
2020లో పెరోల్పై వెళ్లి తిరిగి రాని ఖైదీ
హైదరాబాద్: మహిళ హత్య కేసులో కింది కోర్టు విధించిన యావజ్జీవ శిక్షను హైకోర్టు రద్దు చేయగా.. సదరు ఖైదీ 2020లో తాత్కాలికంగా పెరోల్పై బయటికి వెళ్లి మళ్లీ జైలుకు రాలేదని వెల్లడైంది.
మహబూబ్నగర్ జిల్లాకు చెందిన శాంతమ్మ హత్య కేసులో మహబూబ్నగర్ జిల్లా కోడూరుకు చెందిన ఆటోడ్రైవర్ వడ్డే రాజుకు కింది కోర్టు యావజ్జీవ శిక్ష విధించగా ఇటీవల హైకోర్టు రద్దు చేసిన విషయం విదితమే. రాజుపై ఇతర నేరాలు లేని పక్షంలో తక్షణం విడుదల చేయాలని హైకోర్టు తీర్పు వెలువరించింది. ఈ క్రమంలో పరిశీలించగా.. విడుదల చేయడానికి వడ్డే రాజు | జైలులోనే లేడని వెల్లడైంది. 2014 నుంచి జైలులో ఉన్న రాజు వ్యక్తిగత బాండు సమర్పించి 2020 అక్టోబరు 17న నెల రోజుల పెరోల్పై బయటికి వెళ్లాడు. తరువాత మహబూబ్నగర్ పోలీసు సూపరింటెండెంట్ సిఫార్సు మేరకు డిసెంబరు వరకు పెరోల్ పొడిగించారు. 2020 డిసెంబరు 2న జైలు అధికారుల ముందు వడ్డే రాజు లొంగిపోవాల్సి ఉంది. అయితే రాజు మళ్లీ జైలుకు రాలేదు. ఈ క్రమంలో రాజును పట్టుకుని అప్పగించాలంటూ మహబూబ్నగర్ రూరల్ పోలీసు స్టేషన్ లో 2024 ఫిబ్రవరి 14న జైలు అధికారులు ఫిర్యాదు చేయగా ఎస్ఐఆర్ నమోదైంది. 2020లో పరారైతే 2024లో కేసు నమోదు చేయడం విశేషం. అయితే వడ్డే రాజుపై మరో హత్య కేసు కూడా ఉన్నట్లు సమాచారం.
Also read
- నిమ్మకాయలు.. నల్లటి ముగ్గు.. పసుపు కుంకుమలు.. ఆ ఇళ్ల ముందు రాత్రికి రాత్రే ఏం జరిగింది….
- ఇలా తయారయ్యారేంట్రా..! టీ చేతికి ఇవ్వలేదని ఇంత దారుణమా..?
- Crime News: నది ఒడ్డున్న చెట్టుకు వేలాడుతున్న యువకుడి మృతదేహాం.. ఆ పక్కనే కనిపించిది చూసి..
- కంప్యూటర్ క్లాస్ నుండి వస్తుండగా.. తెగబడ్డ తెంపుడుగాళ్లు.. భయంతో వణుకుతున్న మహిళలు!
- సబ్‌రిజిస్ట్రార్ ఆస్తులు ఏకంగా రూ.100 కోట్లు.. ఏసీబీ వలకి చిక్కిన భారీ అవినీతి తిమింగలం!





