కేరళ నర్సు నిమిష ప్రియ ఉరిశిక్ష ఇటీవల వాయిదా పడ్డ సంగతి తెలిసిందే.కేఏ పాల్ నిమిష ప్రియకు సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేశారు. నిమిష ప్రియను విడుదల చేసేందుకు హౌతీ నాయకులు ఒప్పుకున్నారని తెలిపారు.
కేరళ నర్సు నిమిష ప్రియ ఉరిశిక్ష ఇటీవల వాయిదా పడ్డ సంగతి తెలిసిందే. జులై 16న ఆమెకు ఉరిశిక్ష పడాల్సి ఉండగా చివరి గంటల్లో అక్కడి స్థానిక అధికారులు ఈ ప్రక్రియను వాయిదా వేశారు. మరోవైపు ప్రజాశాంతి చీఫ్ కేఏ పాల్ కూడా నిమిష ప్రియను కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇటీవల ఆయన హౌతీ లీడర్స్‌ను కూడా ఈ విషయం గురించి మాట్లాడినట్లు తెలిపారు. ప్రస్తుతం టర్కీలోని ఇస్తాంబుల్‌లో ఉన్న కేఏ పాల్ నిమిష ప్రియకు సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
నిమిష ప్రియను విడుదల చేసేందుకు హౌతీ నాయకులు ఒప్పుకున్నారని తెలిపారు. మీడియాలో వస్తున్నట్లు బ్లడ్ మనీపై వస్తున్న వార్తలపై బాధితుడి సోదరుడు బాధపడుతున్నట్లు చెప్పారు. బాధితుడి కుటుంబ సభ్యుల్లో అతడి సోదరుడు తప్పా అందరూ కూడా నిమిష ప్రియను విడుదల చేసేందుకు అంగీకరించారని పేర్కొన్నారు. దేవుని దయతో తాము బాధితుడి కుటుంబాన్ని, హౌతీ లీడర్లకు నచ్చజెప్పామని చెప్పారు. హౌతీ అధ్యక్షుడు కూడా దీనికి అంగీకరించి ఏడు రోజుల సమయం ఇచ్చినట్లు తెలిపారు. మరో నాలుగు రోజుల్లో అందరూ శుభవార్త వింటారన్నారు. నిమిష ప్రియ విడుదలవుందని.. ఆమెను భారత్‌కు పంపిస్తారని లేదా తానే తీసుకొస్తానని చెప్పుకొచ్చారు.
Also read
- నేటి జాతకములు…5 నవంబర్, 2025
- అప్పు కోసం పిన్నింటికి వచ్చిన వ్యక్తి.. భార్యతో కలిసి ఏం చేసాడో తెలుసా..?
- Telangana: కనిపెంచిన కొడుకును కడతేర్చిన తండ్రి.. కారణం తెలిస్తే షాకే
- Andhra: అమ్మతో కలిసి కార్తీకదీపం వెలిగించాలనుకుంది.. తీరా చూస్తే కాసేపటికే..
- Telangana: ఆదివారం సెలవు కదా అని బంధువుల ఇంటికి బయల్దేరారు.. కొంచెం దూరం వెళ్లగానే





