May 2, 2025
SGSTV NEWS
CrimeTelangana

TG Crime : ప్రియుడిని ఇంటికి పిలిచి.. భర్తను ఉరేసి లేపేసింది!


ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిందో మహిళ. ఈ ఘటన రంగారెడ్డి జిల్లాలో జరిగింది. ప్రవీణ్‌, ప్రమీల భార్యాభర్తలు. వీరికి ఇద్దరు సంతానం. గత కొంత కాలంగా ప్రమీల మరో వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ప్రియుడితో కలిసి ప్రవీణ్‌కు ఉరివేసి హత్య చేసింది.

ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తను ఉరివేసి చంపిదో భార్య. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా కందుకూరు పోలీస్ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం..  దన్నారం గ్రామానికి చెందిన ప్రవీణ్‌, ప్రమీల దంపతలకు ఇద్దరు సంతానం. అయితే ప్రమీల మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఇది భర్త ప్రవీణ్ కు తెలియడంతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈ క్రమంలో భర్తను చంపేసి ప్రియుడితో కలిసి సుఖంగా ఉండాలని ప్రమీల స్కెచ్ వేసింది. 

ప్రియుడిని ఇంటికి పిలిచి
ప్లాన్ లో భాగంగా..  శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత తన ప్రియుడిని ఇంటికి పిలిచిన ప్రమీల..  ప్రవీణ్‌కు ఉరివేసి హత్య చేసింది. కుటుంబసభ్యులకు,బంధువులకు తన భర్త ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరించింది. అయితే అనుమానం వచ్చిన ప్రవీణ్‌ తల్లిదండ్రులు, గ్రామస్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.  వెంటనే  ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమీలను అదుపులోకి తీసుకుని విచారించగా..  ఆమె అసలు విషయాన్ని ఒప్పుకుంది. ప్రమీల పాటుగా ఆమె ప్రియుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు

Also read

Related posts

Share via