కృష్ణా : బుడమేరులో గల్లంతైన ఫణికృష్ణ మృతదేహం లభ్యమైంది. 3 రోజులక్రితం ఫణి కృష్ణ బుడమేరులో గల్లంతు కావడంతో ప్రత్యేక బృందాలతో అధికారులు, పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. సోమవారం బుడమేరులో ముళ్ళకంచెకు చిక్కుకున్న కలిదిండి ఫణికృష్ణ మృతదేహాన్ని అధికారులు గుర్తించి బయటకు తీశారు. హైదరాబాద్ నుంచి జీపులో స్వగ్రామానికి వస్తుండగా, బుడమేరు వరదలో కేసరపల్లి దగ్గర వాగులో ఫణి కృష్ణ కొట్టుకుపోయాడు. ఈరోజు అతడి మృతదేహం కనిపించింది.
మచిలీపట్నంకు చెందిన కలిదిండి ఫణి కృష్ణ హైదరాబాద్ లోని ఓ కంపెనీలో సాఫ్ట్ వేరు ఉద్యోగం చేస్తున్నాడు. వినాయకచవితి కావడంతో ఇంటికి వెళ్లాడు. శనివారం ఉదయం గన్నవరంలోని బంధువుల ఇంటికి వెళ్లాడు. సాయంత్రం తిరిగి మచిలీపట్నంకు బయలుదేరాడు. అతను కేసరపల్లి- ఉప్పలూరు-కంకిపాడు మీదుగా మచిలీపట్నం వెళ్లాలనుకున్నాడు. అయితే స్థానికులు అటుగా వెళ్లొద్దని.. బుడమేరు వరద ఉందని హెచ్చరించారు. విజయవాడ నుంచి వెళ్లాలని సూచించారు. కానీ ఫణి కృష్ణ కేసరపల్లి- ఉప్పలూరు-కంకిపాడు మీదుగా బయలుదేరాడు. చివరికి అతను బుడమేరు వాగులో చిక్కుకుపోయి కొట్టుకుపోయాడు. గమనించిన స్థానికులు అతడిని కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. రాత్రి కావడంతో ఫణి కృష్ణను రక్షించేందుకు వీలు కాలేదు.. అయినప్పటికీ వెంటనే ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అయితే అప్పటికే ఫణి కృష్ణ కారు స్కార్పియో వరదలో కొట్టుకుపోయింది. ఫణి కృష్ణ కూడా వరదలో కొట్టుకుపోయాడు. వరదలో గల్లంతైన అతడి కోసం ఆదివారం ఉదయం ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది గాలింపు చేపట్టారు. పండగకు ఇంటికి వచ్చిన ఫణి కృష్ణ బుడమేరు వరదలో గల్లంతు అవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. ఈరోజు ఫణి కృష్ణ మృతదేహం బుడమేరులో కనిపించింది.
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025