నెల్లూరు: ప్రేమోన్మాది ఘాతుకానికి ఓ యువతి బలైంది. నెల్లూరు కరెంట్ ఆఫీస్ సెంటర్లో గత రాత్రి(శుక్రవారం) దారుణం చోటు చేసుకుంది. ఓ యువకుడు ఓ యువతిని కత్తితో పొడిచి కిరాతకంగా చంపాడు. బాధితురాలు బీఫార్మసీ విద్యార్థిని మైథిలి ప్రియగా తెలుస్తోంది.
మైథిలికి, నిఖిల్ కు కొంతకాలంగా స్నేహం ఉంది. ఈ క్రమంలో ఆమెను మాట్లాడాలని పిలిచాడు. ఆపై ఆమెపై కత్తితో దాడికి తెగబడ్డాడు నిఖిల్. ఘటన అనంతరం నిందితుడు పీఎస్ లో లొంగిపోయాడు. మైథిలీ మృతదేహాన్ని నెల్లూరు మార్చురీకి తరలించారు పోలీసులు. మరోవైపు నిందితుడ్ని కఠినంగా శిక్షించాలంటూ మైథిలి కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు.
Also read
- Telangana: హైదరాబాద్లో కాల్పుల కలకలం.. గన్తో ఏపీ మాజీ డిప్యూటీ సీఎం తమ్ముడు..
- Watch Video: సర్కార్ బడి టీచరమ్మ వేషాలు చూశారా? బాలికలతో కాళ్లు నొక్కించుకుంటూ ఫోన్లో బాతాఖానీ! వీడియో
- ప్రైవేటు స్కూల్ బాలికపై అర్ధరాత్రి లైంగికదాడి!
- నేటి జాతకములు…5 నవంబర్, 2025
- అప్పు కోసం పిన్నింటికి వచ్చిన వ్యక్తి.. భార్యతో కలిసి ఏం చేసాడో తెలుసా..?





