సొంత అన్ననే హత్య చేసిన దారుణ ఘటన కడప జిల్లా మైదకూరులో చోటుచేసుకుంది. అప్పు విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగి అది ముదరడంతో.. తమ్ముడు బాలరాజు అన్న నారాయణ యాదవ్‌ను గొడ్డలితో నరికి హత్య చేశాడు. ప్రస్తుతం బాలరాజు పరారీలో ఉన్నాడు.
డబ్బుల విషయంలో వాగ్వాదం జరిగి గొడ్డలితో దారుణంగా హత్య చేసిన ఘటన కడపలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మైదకూరు మండలం చెర్లోపల్లికి చెందిన నారాయణ యాదవ్‌ను తమ్ముడు బాలరాజు యాదవ్ గొడ్డలితో హత్య చేశాడు. బాకీ విషయంలో బాలరాజు అన్నతో వాగ్వాదానికి గురయ్యాడు. ఇద్దరి మధ్య మాట మాట పెరిగి పెద్దది అయ్యింది.
గొడ్డలితో నరికి..
ఇంతలో బాలరాజు యాదవ్ అన్నని చంపేశాడు. వెంటనే నారాయణ యాదవ్‌ను మైదుకూరు ఆసుపత్రికి తరలించగా.. మార్గ మధ్యలోనే మృతి చెందాడు. వెంటనే పోలీసులు బాలరాజు మీద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం బాలరాజు యాదవ్ పరారీలో ఉన్నాడు. ఇతని కోసం పోలీసులు గాలిస్తున్నారు
ఇదిలా ఉండగా తెలంగాణలో మరో ఘోరం జరిగింది. నిద్రిస్తున్న భర్తను గొడ్డలితో నరికి చంపింది ఓ భార్య. అర్థరాత్రి ఇంట్లోనే కలిసి పడుకోగా తెల్లారేసరికి భర్త రక్తపు మడుగులో పడి ఉండటం కలకలం రేపింది. భర్త హత్య నేపథ్యంలో భార్య ఇంట్లో లేకపోవడంపై గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హతమార్చి ఇంట్లో నుంచి పారిపోయిందని చెబుతున్నారు. ఈ దారుణమైన ఘటన నాగర్ కర్నూల్ జిల్లా తెలకపల్లి మండలం వట్టిపల్లి గ్రామంలో చోటుచేసుకుంది.
వట్టిపల్లి గ్రామానికి చెందిన ఈశ్వరయ్య(50) ఎల్లమ్మ భార్యభర్తలు. కూలీ పని చేసుకుంటూ బతుకుతున్నారు. అయితే వీరిద్దరి మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి రోజులాగే అన్నం తిని పడుకున్నారు. అయితే మధ్యాహ్నం 12 దాటినా ఇంటి తలుపులు తీయకపోవడంతో గ్రామస్తులు డోర్ ఓపెన్ చేసి షాక్ అయ్యారు. రక్తపు మడుగులో పడున్న ఈశ్వరయ్యను చూసి పోలీసులకు సమాచారం అందించారు.
Also read
- Texas: నెల రోజుల్లో ఇంటికి రావాల్సుంది..అంతలోనే తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయింది!
- కొబ్బరిబొండాల కత్తితో ఇద్దరు కొడుకులను నరికి భవనం పై నుండి దూకి ఆత్మహత్య చేసుకున్న తల్లి
- పూజలో కలశం ప్రాముఖ్యత ఏమిటి? మామిడి ఆకులు, కొబ్బరికాయ ఎందుకు పెడతారో తెలుసా..
- Shukra Gochar 2025: మీనరాశిలో శుక్రుడు అడుగు.. మాలవ్య, లక్ష్మీనారాయణ యోగాలు .. మూడు రాశుల వారు పట్టిందల్లా బంగారమే..
- Jupiter Transit 2025: 12 ఏళ్ల తర్వాత బృహస్పతి మిథునరాశిలోకి అడుగు.. మొత్తం 12 రాశులపై ప్రభావం ఎలా ఉంటుంది? పరిహారాలు ఏమిటంటే