July 3, 2024
SGSTV NEWS
Telangana

టెట్ పరీక్ష ఫీజును తగ్గించాలి బిఆర్ఎస్వి :



ఉపాధ్యాయ అర్హత
పరీక్ష(టెట్) పరీక్ష ఫీజును ప్రభుత్వం 1000 రూపాయలు గా నిర్ణయించింది. ఈ పరీక్ష ఫీజును తగ్గించాలని బిఆర్ఎస్ వి విద్యార్థి సంఘం ప్రభుత్వాని డిమాండ్ చేస్తోంది.

ఈ సందర్భంగా **బీఆర్ఎస్వి జిల్లా నాయకుడు డి శేఖర్ మాట్లాడుతూ*
2011 నుంచి 2021 వరకు టెట్ పరీక్ష ఫీజు 200/- రుపాయాలు మాత్రమే ఉంది, ఇది 2022 వ సంవత్సరం లో 300 రూపాయలు 2023 లో 400 రూపాయలు ఫీజును పెంచారు. కానీ 2024లో నిర్వహిస్తున్న టెట్ కు ఎకంగా 1000/- రూపాయలు పెంచారు ,ఇది దుర్మాగపు చర్య తక్షణమే ప్రభుత్వం టెట్ ఫీజులను తగ్గించి పాత ఫీజులను కోనసాగింపు చేయాలని డిమాండ్ చేస్తున్నాము
అనేక మంది పేద విద్యార్థులు అనేక కష్టనష్టాలను ఓర్చి కొచింగ్ తీసుకుని టెట్ కోసం ప్రిపేరవుతున్నారు. కానీ ఆన్ లైన్ పరీక్ష పేరుతో ఓకేసారి 1000 పెంచడం అంటే అనేక మంది అర్హులకు ఆర్ధిక భారం మోపటడమే అందుకే అందరికీ అందుబాటులో ఉండేలాగా ప్రభుత్వం పెంచిన ఫీజు ఉత్తర్వులు వెనక్కి తీసుకోని ఫీజును తగ్గించాలని డిమాండ్ చేస్తున్నాము.

Also read

Related posts

Share via