April 17, 2025
SGSTV NEWS
Andhra Pradesh

పవన్ కళ్యాణ్  “ప్రాయశ్చిత్త దీక్ష” ముగింపుకు బ్రాహ్మణ చైతన్య వేదిక సంఘీభావం..

అమరావతి:

గుంటూరు జిల్లా జనసేన అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరావు  పిలుపుమేరకు “ప్రాయశ్చిత్త దీక్ష” ముగింపు పాదయాత్ర ర్యాలీకి మద్దతు తెలిపి పాదయాత్రలో పాల్గొన్న బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ శర్మ.   తిరుమల లడ్డులో కల్తీ నెయ్యి వివాదం విధితమే,ఈ నేపద్యంలో రాష్ర్ట ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదల పవన్ కళ్యాణ్ రాష్ట్రవ్యాప్తంగా తమ పార్టీ తరఫున ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు.

ఆయన తిరుమలకు కాలినడకన వెళ్లి, వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకునీ, దీక్ష విరమణ గావించే సందర్భంలో గుంటూరు జిల్లా జనసేన అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు కూడా ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టి నేడు దీక్ష విరమణ సందర్భంగా గుంటూరు బృందావన్ గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి దేవాలయం నుండి నంబూరు వద్ద వున్న దశావతార వెంకటేశ్వర స్వామి దేవాలయం వరకు పాదయాత్ర ర్యాలీ చేపట్టిన సందర్భంగా జనసేన పిలుపుమేరకు బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ శర్మ  పాదయాత్రలో సంఘీభావం తెలియజేసి ఈ పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వంగవీటి చైతన్య శర్మ, చిలుమూరు ఫణి శర్మ, పాత గుంటూరు ఫణి శాస్త్రి తదితరులు పాల్గొన్నారు.

Also read

Related posts

Share via