మంత్రి కొండా సురేఖ, బీజేపీ ఎంపీ రఘునందన్రావుల ఫొటోను అభ్యంతరకరంగా వైరల్ చేసిన వ్యవహారంలో ఇద్దరిని అరెస్టు చేసినట్లు సైబరాబాద్ సైబర్ క్రైమ్ ఏసీపీ రవీందర్రెడ్డి తెలిపారు
హైదరాబాద్: మంత్రి కొండా సురేఖ, బీజేపీ ఎంపీ రఘునందన్రావుల ఫొటోను అభ్యంతరకరంగా వైరల్ చేసిన వ్యవహారంలో ఇద్దరిని అరెస్టు చేసినట్లు సైబరాబాద్ సైబర్ క్రైమ్ ఏసీపీ రవీందర్రెడ్డి తెలిపారు. నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలం కోనాపూర్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచి దేవన్న, జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణానికి చెందిన వ్యాపారి మహేశ్ను మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. వారిని బుధవారం న్యాయస్థానంలో హాజరుపర్చనున్నారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలోని సురేఖ, రఘునందన్రావుల ఫొటోను కొందరు సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేశారు. ఈ వ్యవహారంపై ఎంపీ ఈ నెల 3న మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు సహా కొందరిపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైన విషయం తెలిసిందే.
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025