April 11, 2025
SGSTV NEWS
CrimeTelangana

Yadadri: తెల్లారేసరికి కాలేజీ ఆవరణలో భయంకర సీన్.. అమ్మాయిలు చూడగా.. వామ్మో.!

సృష్టికి ప్రతి సృష్టి జరుగుతున్న నేటి ఆధునిక యుగంలో కూడా ఇంకా క్షుద్ర పూజలు కలకలం రేపుతున్నాయి. యాదాద్రి జిల్లా మోత్కూరులోని ప్రభుత్వ జూనియర్ కాలేజ్ ఆవరణలో క్షుద్ర పూజల ఆనవాళ్లు అలజడి రేపాయి. కాలేజీ ప్రధాన గేటు వద్ద నిమ్మకాయలు, కోడి తలలు, పసుపు, కుంకుమ, మిరపకాయలు తదితర క్షుద్ర పూజలకు ఉపయోగించే వస్తువులతో క్షుద్ర పూజల ఆనవాళ్లు కనిపించాయి. ఈ ప్రభుత్వ జూనియర్ కాలేజీకి పరిసర గ్రామాల నుంచి 400 మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ కోసం వస్తుంటారు. కాలేజీ ప్రధాన ద్వారం గుండె లోపలికి వస్తున్న దారిలో క్షుద్ర పూజలు ఆనవాళ్లు కనిపించాయి. ఈ క్షుద్ర పూజలకు ఉపయోగించే పసుపు, కుంకుమ, మిరపకాయలు, కోడి తలలు కనిపించడంతో విద్యార్థులు, అధ్యాపకులు, తల్లిదండ్రులు ఆందోళన చెందారు. కాలేజీకి నైట్ వాచ్‌మెన్ లేకపోవడం, కాలేజీ చుట్టూ ప్రహరీ గోడ లేకపోవడంతో కాలేజ్ ఆవరణలో అసాంఘిక కార్యకలాపాలు క్షుద్ర పూజలు జరుగుతున్నాయని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. క్షుద్ర పూజల దృశ్యాలను చూసి కాలేజీ యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించారు. వీటిని పరిశీలించిన స్థానిక పోలీసులు.. ఆకతాయిలు చేసిన పనిగా పేర్కొన్నారు.

Also read

Related posts

Share via