April 11, 2025
SGSTV NEWS
CrimeTelangana

Lady Aghori-Sri Varshini: అఘోరీ ఎపిసోడ్‌లో బిగ్ ట్విస్ట్.. వర్షిణిని రప్పా రప్పా ఈడ్చుకెళ్లిన ఫ్యామిలీ


లేడీ అఘోరీకి బిగ్ షాక్ తగిలింది. వర్షిణిని తమ ఫ్యామిలీ ఇంటికి తీసుకొచ్చింది. గుజరాత్‌లోని సౌరాష్ట్రలో పెట్రోల్‌ బంక్‌లో నిద్రిస్తున్న టైంలో విష్ణు, శ్రీ హర్ష పోలీసులతో వెళ్లి పట్టుకున్నారు. తాను అఘోరీని వదిలి రానంటున్నా బలవంతంగా లాక్కెల్లారు.

లేడీ అఘోరీ – వర్షిణీ వ్యవహారం ఈ మధ్య హాట్ టాపిక్‌గా మారింది. వీరిద్దరూ లవర్స్ అని కొందరు ప్రచారం చేస్తున్నారు. అఘోరీ మంత్రాలు చేసి తమ బిడ్డను తీసుకెళ్లిపోయిందని వర్షిణి ఫ్యామిలీ ఆరోపిస్తుంది. వర్షిణి ఆమె ఇష్టంతోనే తన వద్దకు వచ్చిందని అఘోరీ చెబుతోంది. ఏది ఏమైనా వర్షిణి ఇప్పుడు అఘోరీ మాయలో ఉందని.. ఇక తన ఇంటికి ఇప్పుడిప్పుడే వెళ్లేలా కనిపించడం లేదని అంతా భావించారు.

వర్షిణీని ఇంటికి తీసుకొచ్చిన ఫ్యామిలీ
కానీ అందరి అంచనాలు తలకిందులయ్యాయి. వర్షిణి ఫ్యామిలీ ఒక్కసారిగా అఘోరికి షాక్ ఇచ్చింది. వర్షిణి ఫ్యామిలీ అఘోరి నుంచి తమ కూతురుని తీసుకుని వెళ్లిపోయింది. అవును మీరు విన్నది నిజమే. వర్షిణి ఫ్యామిలీ పక్కా ప్లాన్‌ను అమలు చేసింది. ఈ ప్లాన్‌లో భాగంగానే వర్షిణి ఫ్యామిలీ విష్ణు, శ్రీ హర్ష, భవాని అఘోరీ ఉన్న ప్రాంతానికి పోలీసులతో వచ్చారు. గుజరాత్‌లోని సౌరాష్ట్రలో పెట్రోల్‌ బంక్‌లో నిద్రిస్తున్న టైంలో శ్రీవర్షిణిని పోలీసుల సాయంతో తీసుకెళ్లారు. ఆమె అఘోరీని వదిలి రాను రాను అంటూ కన్నీళ్లు పెట్టుకున్నా బలవంతంగా లాక్కెల్లారు. అందుకు సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారాయి

గత ఏడాది నుంచి అఘోరీ తరచూ వార్తల్లో నిలుస్తుంది. పలు ఆలయాలు సందర్శిస్తూ వెళ్లే దారిలో ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూనే ఉంది. ఇందులో భాగంగానే ఇటీవల వర్షిణి అనే యువతిని తన వెంట తిప్పుతూ కనిపించింది. ప్రస్తుతం అదే సెన్సేషనల్‌గా మారింది. వర్షిణీ అనే బీటెక్ విద్యార్థిని ఇంట్లో రెండు వారాలు ఉండటం.. అక్కడ ఆ ఫ్యామిలీకి పలు వస్తువులు, అలాగే వేలకు వేలు పెట్టి వర్షిణీకి బంగారం చైన్ కొనడం వంటివి చేసింది.

అక్కడ వరకు అంతా సాఫీగా సాగిపోయింది. కానీ ఇవన్నీ కొనిచ్చిన అనంతరం వర్షిణీ.. అఘోరీతో వెళ్లిపోయింది. అక్కడ నుంచి అసలు ఆట మొదలైంది. ఒకవైపు వర్షిణీ ఫ్యామిలీ ఆరోపణలు చేస్తుంటే.. మరోవైపు అఘోరీ, ఆమెతో పాటు ఉన్న వర్షిణి వాటికి సమాధానాలు చెబుతూ వస్తున్నారు. ఇక ఇప్పటికైనా వీరి వ్యవహారం సర్దుమనుగుతుందో లేదో చూడాలి.

Also Read

Related posts

Share via