June 29, 2024
SGSTV NEWS
CrimeNational

షీనాబోరా హత్యకేసులో బిగ్ ట్విస్ట్

ముంబై : 12 ఏళ్ల క్రితం జరిగిన హీనాబోరా హత్య కేసులో బిగ్ ట్విస్ట్. కేసులో కీలకంగా ఉన్న షీనాబోరా అస్థికలు (ఎముకలు) మాయమయ్యాయి. కేసు దర్యాప్తులో భాగంగా సీబీఐ అధికారులు హత్య అనంతరం రాయగఢ్ పోలీసులు షీనాబోరా అస్థికల్ని స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడా అస్థికలు కనిపించడం లేదని సీబీఐ అధికారులు ముంబై ప్రత్యేక కోర్టుకు తెలిపారు.

2012,మే 21న మహరాష్ట్రలోని రాయిఘడ్కు చెందిన గణేష్ ఎన్డే తనకెంతో ఇష్టమైన మామిడి పండ్ల సీజన్ వచ్చేసిందని సంతోషంగా ఉన్నాడు. ఆ సంతోషాన్ని మరింత రెట్టింపు చేసేందుకు రాయిఘడ్ అడవుల్లో దొరికే రుచికరమైన మామిడి పండ్ల కోసం బయలు దేరాడు. అయితే అడవిలోకి వెళ్తుండగా.. ఓ చెట్టు సమీపంలో పెద్ద సూట్కేస్ గణేష్ కంటపడింది. అంతే సూట్కేసులో ఏముందో అని చూసిన ఆయన షాక్ తిన్నాడు. వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసి జరిగిన సంఘటన గురించి వివరించాడు. క్షణాల్లో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆ సూట్కేస్లో కాలిన మృతదేహం కనిపించింది.

కట్ చేస్తే షీనా బోరా హత్య జరగ్గా.. మూడేళ్ల తర్వాత ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ కేసులో అరెస్టైన ఇంద్రాణీ ముఖర్జియా డ్రైవర్ను విచారించగా.. షీనా బోరా హత్య గురించి బయటపెట్టాడు.

షీనాను ఇంద్రాణీ గొంతు నులిమి చంపేసిందని, ఆ తర్వాత షీనాబోరాను కాల్చివేసి ఆమె అస్థికల్ని రాయఘడ్లోని గాగోడే- ఖుర్ద్ గ్రామ సమీపంలోని అడవుల్లో పడేసినట్లు చెప్పాడు. అప్రమత్తమైన షీనాబోరా కేసును విచారిస్తున్న అధికారులు స్థానిక రాయఘడ్ పెన్ పోలీసుల సహకారంతో షీనాబోరా అస్థికల్ని స్వాధీనం చేసుకున్నారు.

ఆ ఎముకల్ని పరీక్షించి అవి షీనాబోరావేనని సర్ జేజే హాస్పిటల్ ఫోరెన్సిక్ నిపుణుడు డాక్టర్ జెబా ఖాన్ తేల్చారు. మే 7న కోర్టు విచారణలో సీబీఐ తరపున హాజరైన పబ్లిక్ ప్రాసిక్యూటర్ సీజే నాండోడ్ కేసు విచారణలో షీనాబోరా అస్థికల్ని జెబాఖాన్కు చూపించి విచారణ చేపట్టాలని కోర్టును కోరారు.

ఇందులో భాగంగా గురువారం (జూన్ 13) షీనాబోరా అస్థికల గురించి ఆరా తీయగా అవి మాయమైనట్లు సీబీఐ అధికారులు కోర్టుకు వెల్లడించారు. విచారణలో ఆధారాలు (ఎముకలు) ఉన్న రెండు మార్క్ ప్యాకెట్లను గుర్తించలేకపోయామన్నారు. అస్థికలు లేకున్నా షీనా బోరా కేసు విచారణ కొనసాగించాలని సీబీఐ భావించింది. అందుకు డిఫెన్స్ లాయర్ అభ్యంతరం వ్యక్తం చేశారు

Related posts

Share via