February 23, 2025
SGSTV NEWS
CrimeTelangana

రాజలింగమూర్తి హత్య కేసులో బిగ్ ట్విస్ట్ .. ఏడుగురు అరెస్ట్!


రాజలింగమూర్తి హత్య కేసులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ హత్య కేసును ఛేదించిన పోలీసులు ఏడుగురిని అరెస్ట్ చేశారు. భూ వివాదం వలనే ఈ హత్య జరిగినట్లుగా నిర్ధారించారు. ఈ కేసులో  ఏడుగురిని అరెస్ట్  చేసిన పోలీసులు పరారీలో ఉన్న మరో ముగ్గురి కోసం గాలిస్తున్నారు.

సామాజిక కార్యకర్త రాజలింగమూర్తి హత్య కేసులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ హత్య కేసును ఛేదించిన పోలీసులు ఏడుగురిని అరెస్ట్ చేశారు. భూ వివాదం వలనే ఈ హత్య జరిగినట్లుగా నిర్ధారించారు. ఈ కేసులో  ఏడుగురిని అరెస్ట్  చేసిన పోలీసులు పరారీలో ఉన్న మరో ముగ్గురి కోసం గాలిస్తున్నారు.  మొత్తం పది మంది పై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.  ఇందులో A 1 రేణికుంట్ల సంజీవ్ ను చేర్చారు పోలీసులు.

అరెస్టు అయిన నిందితులు  వీళ్లే! 
A 1 రేణికుంట్ల సంజీవ్
A 2పింగిలి సేమంత్
A 3మోరే కుమార్
A 4కొత్తూరు కిరణ్
A 5రేణికుంట్ల కొమరయ్య
A 6దాసరపు కృష్ణ
A 7రేణికుంట్ల సాంబయ్య
A 8 కొత్త హరిబాబు ( బీఆర్ఎస్ నాయకుడు) (పరారీలో)
A 9 పుల్ల నరేష్ (పరారీలో)
A 10 పుల్ల సురేశ్.(పరారీలో)

2025 ఫిబ్రవరి 19వ తేదీ బుధవారం రాత్రి ఆటోలో వచ్చిన ఐదుగురు గుర్తు తెలియని దుండగులు రాజలింగమూర్తిని నడిరోడ్డుపై కత్తులతో పొడిచి పరారయ్యారు. ఈ ఘటనలో పేగులు భయటపడటంతో రాజలింగమూర్తి స్పాట్ లోనే మృతి చెందాడు.  అయితే రాజలింగమూర్తి హత్య ఘటనపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

కాళేశ్వరం స్కామ్‌పై పోరాటం

ముఖ్యంగా కాళేశ్వరం స్కామ్‌పై గత కొంతకాలంగా రాజలింగమూర్తి పోరాటం చేస్తున్నారు.  కాళేశ్వరం అవకతవకలపై హైకోర్టులో ఆయన  పిటిషన్ కూడా వేశారు.  భూపాలపల్లి మున్సిపాలిటీలోని రెడ్డి కాలనీలో నివాసం ఉంటున్న రాజలింగమూర్తి భార్య సరళ గత పాలకవర్గంలో బీఆర్ఎస్ తరఫున 15వ వార్డు కౌన్సిలర్గా పోటీ చేసి గెలిచింది. కాగా  బీఆర్ఎస్ప్రభుత్వ హయాంలో రాజలింగమూర్తి పై పోలీసులు  రౌడీ షీట్ ఓపెన్ చేశారు. ఆ తర్వాత పీడీ యాక్ట్ పెట్టి జైలుకు తరలించారు.  జైలు నుంచి బయటకు వచ్చాక కేసీఆర్, హరీష్ రావులతో పాటుగా మరికొంతమంది అధికారులపై  మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు విషయంలో ప్రైవేట్ కేసు వేశారు రాజలింగమూర్తి.

Also read

Related posts

Share via