మహబూబాబాద్ హెల్త్ సూపర్ వైజర్ పార్థసారథి హత్య కేసులో బిగ్ ట్విస్ట్ నెలకొంది. భార్య స్వప్నేప్రియుడికి రూ.5 లక్షలు సుపారీ ఇచ్చి హత్య చేయించినట్లు పోలీసుల విచారణలో తేలింది. వెంటనే పోలీసులు స్వప్న, ఆమె ప్రియుడిని అదుపులోకి తీసుకున్నారు.
మహబూబాబాద్ జిల్లాలో ఇటీవల హెల్త్ సూపర్ వైజర్ పార్థసారథి హత్యకు గురైన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. ప్రియుడితో కలిసి భార్య సప్నే భర్తను హత్య చేయించినట్లు పోలీసుల విచారణలో తేలింది. రూ. 5 లక్షల సుపారీ ఇచ్చి మరి హత్య చేయించినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో పార్థసారథి భార్య స్వప్న, ప్రియుడు విద్యాసాగర్‌ను పోలీసుల అరెస్టు చేశారు.
రూ.5 లక్షలు సుపారీ ఇచ్చి మరి భర్తను..
పరారీలో ఉన్న మరో నలుగురు కోసం పోలీసులు గాలిస్తున్నారు. అయితే గత కొద్ది రోజులుగా పార్థసారథి భార్య స్వప్న, విద్యాసాగర్ మధ్య అక్రమ సంబంధం ఉంది. రిలేషన్‌కు అడ్డు వస్తున్నాడని పార్థసారథిని చంపేసినట్లు తేలింది. అయితే పార్థసారథి సోదరి హేమ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. దీంతో విషయం వెలుగులోకి వచ్చింది.
ఇదిలా ఉండగా భర్త క్షణిక ఆవేశం ఇద్దరి పిల్లలను తల్లిలేని వారిని చేసిన ఘటన చోటుచేసుకుంది. వాగ్వాదంలో భార్యను కొట్టగా.. ఆమె తలకు బలంగా దెబ్బతగిలి ప్రాణాలు విడిచింది. ఈ విషాద ఘటన విశాఖ జిల్లాలో చోటుచేసుకుంది. విశాఖలో డాన్సర్లుగా పనిచేస్తున్న బంగార్రాజు, రమాదేవి ఐదేళ్ల క్రితం ఒకరినొకరు ఇష్టపడి ప్రేమ వివాహం చేసుకున్నారు. ఏడేళ్లుగా ఇద్దరూ ఇదే వృత్తి కొనసాగిస్తూ జీవనం గడుపుతున్నారు. వీరిద్దరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు
గతనెల 30న భార్య పుట్టింటికి వెళ్లి.. మళ్ళీ గొడవ పెట్టుకున్నాడు బంగార్రాజు. భర్త చేష్టలతో విసిగిపోయిన రమాదేవి పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు బయలుదేరింది. దీంతో ఆమెను అడ్డుకొని మళ్ళీ వాగ్వాదానికి దిగాడు. కోపంతో భార్యపై దాడి చేశాడు. ఈ క్రమంలో కిందపడిపోయిన రమాదేవి తలకు బలంగా దెబ్బతగిలింది. వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించింది
Also Read
- AP Crime: ఏపీలో మరో పరువు హత్య.. మైనర్ బాలికను చంపేసిన పేరెంట్స్!?
- సర్కార్ గట్టుకు మరమ్మతులు చేపట్టిన గుడివాడ ఎమ్మెల్యే వెనిగళ్ళ రాము
- గురు, రాహువులతో ఆ రాశులకు ఐశ్వర్య యోగాలు..!
- Vastu Tips: ఈ పక్షులు ఇంటికొస్తే మీ దశ తిరిగినట్టే.. ఈ మూగజీవాలు ఇచ్చే సంకేతాలివే..
- నేటి జాతకములు.11 ఏప్రిల్, 2025