కడియం..
కడియం మండలం కడియపులంక పంచాయతి పరిధి వెంకాయమ్మ పేట గ్రామం లో మంగళవారం ఉదయం విద్యార్థులతో వెళుతున్న ప్రైవేట్ స్కూల్ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. విద్యార్థులతో బయలుదేరిన బస్సు వెంకాయమ్మ పేట వద్ద అదుపుతప్పి నర్సరీ మొక్కల్లో పడిపోవడంతో స్థానికులు బస్సు అద్దాలు బద్దలు కొట్టి విద్యార్థులను బయటకు తీసినట్లు వినికిడి.వారిలో ఇరువురు విద్యార్థులకు స్వల్ప గాయాలు అయినట్లు స్థానికులసమాచారం. ప్రమాదానికి గల కారణం అతివేగమా లేక అవగాహన లేని డ్రైవర్లతో విద్యార్థులను తరలించడమా? నర్సరీ రైతులు రోడ్డు మార్జిన్లు పూర్తిగా ఆక్రమించడమా? అనేది తెలియాల్సివుంది . అయితే విద్యార్థులు సంఖ్య తక్కువగా సుమారు 15 మంది ఉండటంతో స్వల్ప గాయాలతో బయటపడినట్లు స్థానికులు తెలియ జేస్తున్నారు. కడియం ఓ ప్రైవేట్ స్కూల్ కి చెందిన బస్సుగా గుర్తించారు. ప్రమాదానికి గురైన బస్సును సంఘటనా స్థలం నుంచి హడావిడిగా స్కూల్ యాజమాన్యం తరలించింది.
Also read
- నేటి జాతకములు 22 నవంబర్, 2024
- తెలంగాణ : అయ్యో..పాపం..వీళ్లు బంధువాలా.. రాబందువులా?.. ఆస్తిని కాజేసి చివరికి..
- ఈ ఆంజనేయ స్వామి కొండ ఎక్కితే.. పచ్చగా మారుతున్న భక్తులు
- చెల్లి ఫొటోతో ఎఫ్బీ అకౌంట్..యువకుడి నుంచి కోట్లువసూలు, ట్విస్ట్ సూపర్
- అమ్మాయితో మాట్లాడాడని ఇంటర్ విద్యార్థిపై దాష్టీకం కోనసీమలో నలుగురు యువకుల దౌర్జన్యం