విశాఖ హనీ ట్రాప్ కేసులో సంచలనాలు బయపడుతున్నాయి. కిలాడి లేడి జాయ్ జమియా ట్రాప్‌లో పదుల సంఖ్యలో బడా నేతలు, వ్యాపారవేత్తలు ఉన్నట్లు తెలుస్తోంది. నిఘా విభాగం ఏజెంట్, బీన్ బోర్డ్ కెఫ్ ఓనర్ జమియా ట్రాప్‌లో పడ్డట్లు పోలీసులు గుర్తించారు
Joy Jamina: విశాఖ హనీ ట్రాప్ కేసులో సంచలనాలు విషయాలు బయపడుతున్నాయి. కిలాడి లేడి జాయ్ జమియా ట్రాప్‌లో పదుల సంఖ్యలో పలువురు బడా నేతలు, ప్రముఖ వ్యాపారవేత్తలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఓ నిఘా విభాగం ఏజెంట్ కూడా జాయ్ జమియా ట్రాప్‌లో చిక్కుకున్నట్లు పోలీసులు గుర్తించారు. విశాఖ పనోమా హిల్స్ దగ్గర ఉంటున్న నిఘా ఏజెంట్ తోపాటు పనోరమా హిల్ దగ్గర బీన్ బోర్డ్ కెఫ్ నడుపుతున్న వ్యక్తి ఈ కిలాడీ లేడి ట్రాప్‌లో పడ్డట్లు పోలీసులు వెల్లిడించారు. అయితే వారి పేర్లు బయటకు రాకుండా విచారణ చేస్తున్నట్లు సమాచారం. కాగా ఈ జాయ్ హనీట్రాప్ వెనుక పెద్ద రాకెట్ ఉందని సీపీ శంఖబ్రత బాగ్చీ తెలిపారు.
అందంతో బుట్టలో వేసుకుని..
ధనవంతులే టార్గెట్‌గా తన అందంతో బుట్టలో వేసుకుని లక్షలు కాజేస్తోంది ఈ మాయా లేడీ. సోషల్ మీడియాలో వేదికగా విదేశాల్లో ఉన్న అబ్బాయిలకు వలవేసి భారత్‌కు రప్పిస్తోంది. గతంలో కూడా తన స్నేహితులతో కలిసి ధనవంతుల అబ్బాయిలను ప్రేమపేరుతో ట్రాప్ చేసి భారీగా దోచేసింది జామియా. విశాఖలోని షీలా నగర్ కు చెందిన ఓ యువకుడికి మాయమాటలు చెప్పి విశాఖకు రప్పించి పెళ్లిపేరుతో బ్లాక్ మెయిల్ కు పాల్పడ్డ సంగతి తెలిసిందే. కాగా స్నేహం, ప్రేమ, పెళ్లి ముసుగులో వలపు వల విసురుతున్నారు. తమ మాటలు నమ్మి దగ్గరైన వారి బలహీనతలను గుర్తించి సొమ్ము చేసుకుంటున్నారు. ముందుగా మేసేజ్ చేసి ఆ తర్వాత పర్సనల్ గా కలిసి టెంప్ట్ చేసి అందినకాడికి దోచేస్తున్నట్లు నిందుతురాలి విచారణలో పోలీసులు వెల్లడించారు.
ఈ కేసును పోలీసులు సీరియస్‌గా తీసుకున్న పోలీసులు.. మిగిలిన నిందితులను త్వరలోనే పట్టుకుంటామని చెబుతున్నారు. ఈ కేసుపై దర్యాప్తు ముమ్మరం చేసి, ఈ ముఠా ఎన్ని నేరాలకు పాల్పడిందో డేటా సేకరిస్తున్నామని సీపీ శంఖబ్రత బాగ్చీ తెలిపారు.
Also read
- AP Crime: ఏపీలో మరో పరువు హత్య.. మైనర్ బాలికను చంపేసిన పేరెంట్స్!?
- సర్కార్ గట్టుకు మరమ్మతులు చేపట్టిన గుడివాడ ఎమ్మెల్యే వెనిగళ్ళ రాము
- గురు, రాహువులతో ఆ రాశులకు ఐశ్వర్య యోగాలు..!
- Vastu Tips: ఈ పక్షులు ఇంటికొస్తే మీ దశ తిరిగినట్టే.. ఈ మూగజీవాలు ఇచ్చే సంకేతాలివే..
- నేటి జాతకములు.11 ఏప్రిల్, 2025