బెట్టింగ్ యాప్‌లు ప్రమోట్ చేస్తున్న వారిపై పోలీసులు సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నారు. తెలుగు రాష్ట్రా్ల్లో సినీ నటులు, సోషల్ మీడియా ఇన్‌ఫూఎసర్లులపై పోలీసులు కేసు నమోదు చేశారు
బెట్టింగ్ యాప్‌లు ప్రమోట్ చేస్తున్న వారిపై పోలీసులు సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 11 మంది సినీ ప్రముఖులు, సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్, హర్ష సాయి, టెస్టీ తేజ, కిరణ్ గౌడ్, విష్ణుప్రియ, యాంకర్ శ్యామల, రీతూ చౌదరి, బండారు షేషయాని సుప్రీత తదితరులపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు
ఇప్పటికే అటు తెలంగాణ పోలీసులు భయ్యా సన్నీ యాదవ్‌ను, ఆంధ్ర ప్రదేశ్ పోలీసులు లోకల్ బాయ్ నానిలపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. వారిపై 318(4) BNS, 3, 3(A), 4 TSGA, 66D ITA Act-2008 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసి అమాయకులకు అధిక డబ్బులు ఆశ చూపించి ఆర్థికంగా నష్టపోడానికి కారణమైయ్యారంటూ వీరిపై గత కొన్ని రోజులగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ బెట్టింగ్ యాప్‌ను నిర్మూలించాలని పోరాటం చేస్తున్నారు. సే నో టూ బెట్టింగ్ యాప్స్ అంటూ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు. ఆయనతోపాటు నా అన్వేష్, యువ సామ్రాట్‌లు కూడా బెట్టింగ్ యాప్ ప్రమోషన్లకు వ్యతిరేకంగా పని చేస్తున్నారు. పలు షోలు, సోషల్ మీడియాతో ఫేమ్ తెచ్చుకున్న వారు బెట్టింగ్ పెట్టి పెద్ద మొత్తంలో డబ్బు సంపాధించవచ్చని యువతకు సూచిస్తున్నారు. బెట్టింగ్ యాప్‌ల వలలో పడి చాలామంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.
Also read
- దీపావళి ఏ రోజు జరుపుకోవాలో తెలుసా? పండితులు ఇచ్చిన క్లారిటీ ఇదే!
- Hyderabad : రేవ్ పార్టీ భగ్నం.. పోలీసుల అదుపులో 72 మంది ఫెర్టిలైజర్ డీలర్లు
- AP Crime: గుంటూరులో ఘోరం.. రన్నింగ్ ట్రైన్లో మహిళను రే**ప్ చేసి.. ఆపై డబ్బులు, నగలతో..
- HOME GUARD ABORT : ప్రేమ పేరుతో మోసం చేసిన హోంగార్డు..అబార్షన్ వికటించి యువతి మృతి
- Bengaluru : భార్యను స్మూత్ గా చంపేసిన డాక్టర్.. ఆరు నెలల తరువాత బిగ్ ట్విస్ట్!