కాకినాడ వార్పు రోడ్డు ఏరియా ట్రాన్స్‌పోర్ట్ కంపెనీలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాకినాడ వార్పు రోడ్ల గల జై బాలాజీ ట్రాన్స్ పోర్ట్‌లో ఘటన చోటుచేసుకుంది
AP Crime: కాకినాడ వార్పు రోడ్డు ఏరియా ట్రాన్స్‌పోర్ట్ కంపెనీలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాకినాడ వార్పు రోడ్ల గల జై బాలాజీ ట్రాన్స్ పోర్ట్‌లో ఘటన చోటుచేసుకుంది. ట్రాన్స్‌పోర్ట్‌లో వస్తున్న సామాగ్రి దింపుతున్న క్రమంలో అందులో పనిచేస్తూన్న హమామీలు వస్తువులు దింపుతుండగా పేలుడు జరిగినట్లు సమాచారం
దీపావళి సామాగ్రి బ్యాగ్ నుంచి బ్లాస్టింగ్:
దీపావళి సామాన్లు లారీపైనుంచి కిందకి వేయడంతో ఒక్కసారిగా దీపావళి సామాగ్రి బ్యాగ్ నుంచి బ్లాస్టింగ్ జరిగింది. హమాలీల్లో ఇద్దరకు తీవ్ర గాయాలు.. మరో ముగ్గురికి స్వల్ప గాయాలు అయ్యాయి. ప్రమాదంపై సమాచారం అందుకున్న స్థానిక ఎస్పీ బిందు మాధవ్, ఎస్డిపిఓ దేవరాజ్ పటేల్, స్థానిక సీఐలు సంఘటన స్థలానికి చేరుకున్నారు. అనంరతం ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పేలుడుకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
Also read
- తుని ఘటన: టీడీపీ నేత నారాయణరావు మృతదేహం లభ్యం
- Telangana: అయ్యయ్యో.. ఇలా దొరికిపోతారని అనుకోలేదు.. ట్విస్ట్ మామూలుగా లేదుగా.. వీడియో వైరల్..
- పెళ్లి కోసం వచ్చిన వ్యక్తికి ఫుల్‌గా తాగించిన మైనర్లు.. తర్వాత ఏం చేశారో తెలిస్తే.. ఫ్యూజులెగరాల్సిందే
- Andhra: కడుపునొప్పితో మైనర్ బాలిక ఆస్పత్రికి.. ఆ కాసేపటికే..
- విజయవాడలోని ఈ ప్రాంతంలో భయం..భయం.. ఎందుకో తెలిస్తే అవాక్కే..





