భూపాలపల్లిలో రాజలింగమూర్తి హత్య సంచలనంగా మారింది. ఈ మర్డర్‌పై మృతుడి భార్య సంచలన ఆరోపణలు చేశారు. ముఖ్యంగా బీఆర్ఎస్ నాయకులపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్నపోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు. దీంతో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి
Bhupalapalli murder : భూపాలపల్లిలో మాజీ కౌన్సిలర్ భర్త హత్య సంచలనంగా మారింది. ఈ మర్డర్‌పై మృతుడి భార్య సంచలన ఆరోపణలు చేశారు. ముఖ్యంగా బీఆర్ఎస్ నాయకులపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు. దీంతో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. గతంలో రాజలింగమూర్తికి సహకరించిన వారే హత్యకు పాల్పడ్డారని తెలుస్తోంది. అందుకు కారణం భూ వివాదమని అంటున్నారు. ఈ హత్యలో పాల్గొన్న నలుగురిలో.. ఇప్పటికే పోలీసులు ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు సమాచారం.
భూమిని కాజేయాలనే…
భూవివాదం నేపథ్యంలోనే తన భర్త హత్య జరిగినట్లు రాజలింగమూర్తి భార్య సరళ ఫిర్యాదు చేశారని.. భూపాలపల్లి పోలీస్ స్టేషన్ ఎదుట రాజలింగమూర్తి కుటుంబానికి భూమి ఉంది. ఆ భూమికి సంబంధించి రేణుకుంట్ల కొమురయ్య, రేణుకుంట్ల సంజీవ్ కుటుంబంతో విభేదాలున్నాయి. ఆ భూమిని కాజేసే ప్రయత్నం చేయగా సివిల్ కోర్టును ఆశ్రయించారని భార్య సరళ తెలిపింది.చాలా రోజులుగా కేసు నడుస్తున్నా తీర్పు త్వరలోనే రానుండంతో భూమిని కాజేయాలనే తన భర్తను చంపారని ఆమె ఫిర్యాదు చేసింది. పింగిలి శ్రీమంత్, రేణుకుంట్ల సంజీవ్, మోరే కుమార్, కొత్తూరు కుమార్, రేణుకుంట్ల కొమరయ్యపై ఫిర్యాదు చేయగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అయితే.. హత్యకు రాజకీయ కారణాలు ఉన్నాయనే ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో అదుపులో ఉన్న నిందితుల సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
భూ వివాదంలోనూ ట్విస్ట్
రాజలింగమూర్తికి ఉన్న భూమి విషయంలోనూ ట్విస్ట్ నెలకొంది. భూపాలపల్లి పోలీస్ స్టేషన్ ఎదురుగా 319 సర్వే నంబరులో 2.25 ఎకరాల భూమి ఉంది. అందులోని ఒక ఎకరాన్ని సింగరేణి యాజమాన్యం రోడ్డు నిర్మాణానికి సేకరించింది. మిగిలిన 1.25 ఎకరాల గురించి బుర్ర చంద్రయ్య-రేణుకుంట్ల కొమరయ్య మధ్య వివాదం నడుస్తోంది. దీనికోసం రాజలింగమూర్తి ఓ లాయర్‌తో కేసు వేయించారు. 1.25 ఎకరాలను కోర్టు ద్వారా రేణుకుంట్ల కొమరయ్యకు వచ్చేలా పనిచేశారు. అయితే లాయర్ ఫీజు కింద 6 గుంటల భూమిని ఇచ్చేందుకు కొమరయ్య ఒప్పుకున్నారని.. అందులో 4 గుంటలు లాయర్ భార్య పేరిట, 2 గుంటలు రాజలింగమూర్తి భార్య పేరిట రిజిస్ట్రేషన్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ 6 గుంటలు కాకుండా.. ఖాళీగా ఉన్న స్థలాన్ని స్వాధీనం చేసుకోవడానికి కొమరయ్య కుటుంబ సభ్యులు చాలాసార్లు ప్రయత్నించినట్లు తెలిసింది. దీంతో లింగమూర్తికి, కొమురయ్యకు మధ్య విభేదాలు..
ఈ నేపథ్యంలో.. తన భార్య పేరిట ఉన్న స్థలాన్ని కొందరు కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని.. 6 నెలల కిందట రాజలింగమూర్తి కోర్టును ఆశ్రయించారు. ఈ కేసుపై ఈ నెల 20న గురువారం భూపాలపల్లి సబ్ కోర్టులో విచారణ జరగాల్సి ఉంది. కానీ బుధవారం రాత్రే ఈ హత్య జరిగింది. పిటిషనర్ మృతితో కేసు విచారణను కోర్టు వాయిదా వేసింది. ఈ వివాదం కారణంగానే రాజలింగమూర్తిని కొమరయ్య కుటుంబ సభ్యులే హత్య చేసి ఉంటారని ప్రచారం జరుగుతోంది.
గన్ లైసెన్స్ కోసం కలెక్టర్ కు దరఖాస్తు
రాజలింగమూర్తిపై భూపాపల్లిలో అనేక వివాదాలున్నట్లు ప్రచారం సాగుతోంది. జిల్లా కేంద్రంలో కబ్జాలో ఉన్న అటవీ, ప్రభుత్వ భూముల మీదా కేసులు వేసి ఆ భూములు ఆయా శాఖలకు దక్కేలా పోరాడేవాడట. గతంలో భూపాలపల్లి ఓపెన్ కాస్ట్ ఏర్పాటుపై గ్రీన్ ట్రిబ్యునల్ ను సైతం ఆశ్రయించాడు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని ఏకంగా కేసీఆర్ పైనే కేసు వేశాడు. అయితే అనేక భూ వివాదాల్లో తలదూర్చడంతో రాజలింగమూర్తికి శతృవులు ఎక్కు వయ్యారు. దీంతో తనకు పలువురితో ముప్పు ఉందని గన్ లైసెన్స్ కావాలంటూ ఆరునెలల క్రితం కలెక్టర్ కు లేటర్ రాశాడు. ఆయన ఆ లేఖను జిల్లా ఎస్పీకి పంపాడు. అయితే లైసెన్స్ విషయంలో పోలీసులు విచారణ కూడా జరిపారు. అయితే రాజలింగమూర్తిపై పలు క్రిమినల్ కేసులున్నట్లు తేలడంతో ఆయనకు లెసెన్స్ ఇవ్వలేమని తేల్చి చెప్పారు.
Also read
- Maha Shivaratri Fasting: మహాశివరాత్రి ఉపవాసం ఎలా చేయాలి..? పాటించాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..!
- Maha Shivaratri: మహాశివరాత్రి రోజున ఈ పూజ చేసేవాళ్లకు శివుడి ప్రత్యేక ఆశీర్వాదం..! ఆ శివుడు మీ జీవితాన్నే మార్చేస్తాడు..!
- Gang rape : నిజామాబాద్ లో దారుణం..అక్కచెల్లెళ్లపై గ్యాంగ్ రేప్
- Atrocious : జగిత్యాలలో దారుణం … ఆస్తికోసం అన్నను చంపిన చెల్లెళ్లు
- POCSO case : సిద్ధిపేటలో ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు