March 13, 2025
SGSTV NEWS
Andhra PradeshCrimeSpiritual

AP BREAKING: భీమవరం రథోత్సవంలో భారీ అగ్ని ప్రమాదం!


భీమవరం పంచారామ క్షేత్రం సోమేశ్వర జనార్ధన స్వామి వారి రధోత్సవ కార్యక్రమంలో అపశ్రుతి చోటుచేసుకుంది. బాణాసంచా కాలుస్తుండగా ఆలయం వద్ద ఏర్పాటు చేసిన పందిరిపై తారాజువ్వ పడింది. దీంతో ఒక్కసారిగా మంటలు ఎగసిపడడంతో భక్తులు భయాందోళనలకు గురయ్యారు

Bhimavaram: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పంచారామ క్షేత్రం సోమేశ్వర జనార్ధన స్వామి వారి రధోత్సవ కార్యక్రమంలో అపశ్రుతి చోటుచేసుకుంది. రథోత్సవ కార్యక్రమంలో భాగంగా బాణాసంచా కాలుస్తుండగా ఆలయం వద్ద ఏర్పాటు చేసిన పందిరిపై ప్రమాదవశాత్తు ఓ తారాజువ్వ ఎగిరి పడింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు ఎగసిపడుతుండడంతో ఆలయంలోని భక్తులు భయబ్రాంతులకు గురయ్యారు. కొంతమంది సాహసం చేసి పందిరి పై తాటాకులను తీసి కింద పడేశారు. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న సిబ్బంది మంటలను అదుపు చేశారు.

వీడియో

Also read

Related posts

Share via