భద్రచలం సీఐ రమేష్ లంచం తీసుకొని ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. గ్రావెల్స్ తవ్వకానికి అనుమతి ఇవ్వాలంటే రూ.30వేలు డిమాండ్ చేశాడు. రూ.20వేలు బేరం కుదుర్చుకున్నాడు. బాధితుడి దగ్గర నుంచి గన్‌మెన్‌కు ఫోన్ పే చేయించుకున్నాడు. అలా CI రమేష్ ACBకి చిక్కాడు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోలీస్ అధికారి అవినీతి నిరోధక శాఖ ఆఫీసర్లకు పట్టబడ్డాడు. భద్రాచలం సర్కిల్ ఇన్‌స్పెక్టర్ రమేష్ గురువారం లంచం తీసుకుంటూ ACBకి రెడ్‌హ్యాడెండ్‌గా చిక్కాడు. సీఐ రమేష్ గ్రావెల్ తవ్వకాల కోసం రూ.30 వేల లంచం డిమాండ్ డిమాండ్ చేశాడు. బాధితుడికి లంచం ఇవ్వడం ఇష్టం లేదు. లంచం ఇస్తేనే గ్రావెల్ తవ్వకాలకు అనుమతి అంటూ బాధితుడిని సీఐ బెదిరించాడు. అతికష్టం మీద రూ.20 వేలు లంచం ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు.
గన్‌మెన్ రామారావు ద్వారా మూడో వ్యక్తికి ఫోన్ పే చేయాలని బాదితుడికి చెప్పారు. బాదితుడితో పోలీసుల కాల్ రికార్డింగ్స్, ఫోన్ పే హిస్టరీ వివరాలు కూడా ఉన్నాయి. ఆ ఎవిడెన్స్‌తో బాదితుడు ఏసీబీ అధికారులకు సంప్రదించాడు. అవినీతి నిరోధక శాఖ అధికారులు రంగంలోకి దిగి సీఐ, అతని సిబ్బందిని విచారించారు. మొదటి నుంచి రమేష్‌పై అవినీతి అభియోగాలు ఉన్నాయని డిపార్ట్‌మెంట్‌లో చెప్పుకుంటున్నారు. భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు సీఐ రమేష్‌పై ఆరోపణలు ఉన్నాయి.
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025